Mohan Babu : ప్రముఖ నటుడు మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం.. సన్ ఆఫ్ ఇండియా. ఈ మూవీ ఈ నెల 18వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తాజాగా నిర్వహించారు. అలాగే మోహన్ బాబు తన సినిమా గురించి, ప్రస్తుతం ఉన్న రాజకీయాల గురించి మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
సన్ ఆఫ్ ఇండియా మూవీ గురించి మోహన్ బాబు మాట్లాడుతూ.. డైమండ్ రత్నబాబు కథ చెప్పగానే వెంటనే నచ్చి ఓకే చేశానని, ఇందులో కొంత రిస్క్ ఉందని, అయినప్పటికీ సాహసం చేశామని తెలిపారు. ఇక మంచు విష్ణు ఈ చిత్రానికి నిర్మాత అని అన్నారు. ఈ మూవీలో అమ్మాయిల మధ్య లిప్ లాక్ సీన్లు పెట్టాల్సి వచ్చిందని.. అయితే విష్ణు అందుకు ఒప్పుకోలేదని అన్నారు. మనది పరువు ప్రతిష్టలు ఉన్న కుటుంబం, పైగా తాను మా అధ్యక్షుడు. నిర్మాతగా ఉండి ఈ సినిమా తీశాడు. ఇలాంటి సినిమాలో ముద్దు సీన్లు పెడితే అనవసరంగా వివాదాలకు తావు ఇచ్చినట్లు అవుతుందని.. విష్ణు అన్నాడని.. మోహన్ బాబు తెలిపారు.
అయితే కథ డిమాండ్ చేసింది కనుక లిప్ లాక్ సీన్లు పెట్టవచ్చు, ఏమీ కాదని.. తాను విష్ణుకు నచ్చజెప్పానని అన్నారు. ఇక ఈ మూవీలో.. ఒక ఎమ్మెల్యే వల్ల జీవితం నాశనం అయిన వ్యక్తి జైలు నుంచి తప్పించుకుని బయటకు వచ్చి ఏం చేశాడన్నది.. చూపించామని.. మిగిలిన కథ కోసం సినిమా చూడాలని అన్నారు. దీన్ని ముందుగా ఓటీటీలకే ఇవ్వాలని అనుకున్నామని, కానీ థియేటర్లలో విడుదల చేస్తున్నామని, తరువాత ఓటీటీల్లోనూ వస్తుందని అన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…