IPL : బెంగళూరులో గత రెండు రోజులుగా కొనసాగిన ఐపీఎల్ 2022 మెగావేలం ఎట్టకేలకు ముగిసింది. ఈ క్రమంలోనే ఫ్రాంచైజీలు అన్నీ పోటీలు పడి మరీ ప్లేయర్లను కొనుగోలు చేశాయి. వచ్చే సీజన్‌లో తమ సత్తా చాటేందుకు ప్లేయర్లను సిద్ధం చేసుకున్నాయి. ఇక ఈసారి చెన్నై టీమ్ అందరినీ షాక్‌కు గురి చేసింది. ఆ జట్టులోని కీలక ఆటగాడైన సురేష్ రైనాను టీమ్ మళ్లీ కొనుగోలు చేయలేదు. దీంతో చెన్నై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము చిన్న తలగా పిలుచుకునే సురేష్ రైనాను చెన్నై టీమ్ కొనుగోలు చేయకపోవడంతో వారు మండిపడుతున్నారు.
చెన్నై టీమ్ ఈసారి రవీంద్ర జడేజా, ధోనీ, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్‌లను రిటెయిన్ చేసుకుంది. దీంతో మిగిలిన ప్లేయర్లు అందరూ వేలంలో నిలిచారు. వారిలో సురేష్ రైనా కూడా ఉన్నాడు. అయితే దీపక్ చాహర్, బ్రేవో, అంబటి రాయుడు, ఎన్.జగదీశన్, కేఎం ఆసిఫ్, మిచెల్ శాంట్‌నర్ వంటి పాత ఆటగాళ్లను చెన్నై తిరిగి కొనుగోలు చేసి టీమ్‌లోకి తీసుకుంది. దీంతో మళ్లీ పాత ప్లేయర్లు అందరూ టీమ్‌లోకి వచ్చేశారు. అయితే సురేష్ రైనాను మాత్రం జట్టు యాజమాన్యం కొనుగోలు చేయలేదు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు.
వాస్తవానికి 2020 ఐపీఎల్ సీజన్‌లో దుబాయ్‌లో నిర్వహించినప్పుడు సురేష్ రైనా టోర్నీ ఆరంభంలోనే వెనుదిరిగాడు. తనకు కుటుంబ సమస్యలు ఉన్నాయని, అందుకనే తాను టోర్నీ నుంచి తప్పుకున్నానని రైనా అప్పట్లో వెల్లడించాడు. కానీ కారణం అది కాదని.. అతనికి హోటల్ గది నచ్చకే టోర్నీ నుంచి తప్పుకుని వెళ్లిపోయాడని వార్తలు వచ్చాయి. వాటిని జట్టు యాజమాన్యం, రైనా ఖండించలేదు. అయితే అది ముగిసిన అధ్యాయం. గతేడాది మళ్లీ చెన్నై టీమ్‌లో ఆడిన రైనా రెచ్చిపోయాడు. ఈ క్రమంలోనే చెన్నై మళ్లీ ఐపీఎల్ ట్రోఫీని లిఫ్ట్ చేసింది.
ఇక గతంలోనూ అనేక మ్యాచ్‌లలో చెన్నై తరఫున ఆడిన రైనా జట్టుకు అనేక సార్లు కీలక విజయాలను అందించాడు. అయితే రైనా చేసిన సేవలను మరిచిపోయిన చెన్నై యాజమాన్యం కావాలనే అతన్ని జట్టులోకి తీసుకోలేదని, ఇది తమను తీవ్రంగా కలచివేస్తుందని, రైనాను తీసుకోనందుకు నిరసనగా చెన్నై జట్టుకు ఇకపై సపోర్ట్ చేయబోమని.. ముంబైకి సపోర్ట్ అందిస్తామని.. ఫ్యాన్స్ బహిరంగంగానే సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయంలో చెన్నై ఏం చేస్తుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…