Micromax In Note 2 : మైక్రోమ్యాక్స్ సంస్థ ఇటీవలే ఇన్ నోట్ 2 (In Note 2) పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసిన విషయం విదితమే. ఇందులో 6.43 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ముందు వైపు పంచ్ హోల్ కెమెరా ఉంది. డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జి95 ప్రాసెసర్ ఉంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లో ఈ ఫోన్ లభిస్తోంది. ఇందులో ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది.

మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 ఫోన్‌ను ఆదివారం నుంచి విక్రయించనున్నారు. ఈ ఫోన్ ధర రూ.13,490 ఉండగా.. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది. కంపెనీకి చెందిన అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్‌లోనూ ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
లాంచింగ్ ఆఫర్ కింద మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 స్మార్ట్ ఫోన్‌ను రూ.12,490 ధరకు అందిస్తున్నారు. కేవలం పరిమిత కాలం పాటు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. సిటీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ఈ ఫోన్‌పై 5 శాతం క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చు.
Micromax In Note 2 : వెనుక భాగంలో నాలుగు కెమెరాలు
ఈ ఫోన్‌లో వెనుక భాగంలో నాలుగు కెమెరాలు ఉన్నాయి. 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాతోపాటు 5 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్‌లు ఉన్నాయి. ముందు వైపు 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి ఫీచర్లు ఈ ఫోన్‌లో లభిస్తున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క వైపున ఉంది. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 30 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తోంది. అందువల్ల ఫోన్ కేవలం 25 నిమిషాల్లోనే 50 శాతం వరకు చార్జింగ్ అవుతుంది.