Mehreen : ఓసీడీ.. ఈ పదం గురించి తెలియాలంటే మహానుభావుడు సినిమా చూడాల్సిందే. ఆ చిత్రంలో శర్వానంద్ అతి శుభ్రంగా ఉంటూ చుట్టు పక్కల వారికి చిరాకు తెప్పిస్తుంటాడు. ఇలాంటి ఛాదస్తం మెహ్రీన్ కు కూడా ఉంది. తనకు సంబంధించిన ప్రతి వస్తువుని నీట్‌గా ఉంచుకోవాలని అనుకుంటుందట. ఇంటిని, కారుని పదే పదే శుభ్రం చేయిస్తుందట మెహ్రీన్.
తాజాగా ఇదే విషయంపై మాట్లాడిన మెహ్రీన్.. “మహానుభావుడు సినిమాలో హీరోకు అతిశుభ్రత అనే ఓసీడీ ఉంటుంది. కానీ నాకు రియల్ లైఫ్ లో ఉంది. నేను కొన్ని ఏళ్లుగా శానిటైజర్ వాడుతున్నాను. కరోనా రాక ముందు నా బ్యాగ్‌లో రెండు నుండి మూడు శానిటైజర్స్ ఉండేవి. ఇప్పుడు ఏడు ఉంటాయి. చేతులు కడుక్కోకపోయినా, శానిటైజర్ రాసుకోకపోయినా నేను నా స్టాఫ్ తో మాట్లాడను.
మేకప్ మేన్ అయితే చేతులు కడుక్కొని, శానిటైజర్ రాసుకున్న తర్వాతే నా ఫేస్ టచ్ చేయాలి. మొదటి నుండి నేను ఇలానే ఉన్నాను.. అంటూ చెప్పుకొచ్చింది పంజాబీ బ్యూటీ. ఈ అమ్మడు రీసెంట్‌గా మంచి రోజులు వచ్చాయి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అద్భుతమైన పర్‌ఫార్మెన్స్ కనబరిచింది. మరోవైపు ఎఫ్ 3 అనే చిత్రంతో త్వరలో పలకరించేందుకు సిద్ధమైంది.