Mehreen : డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా యూవీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ పతాకాలపై వి సెల్యూలాయిడ్, ఎస్‌కేఎన్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం “మంచి రోజులు వచ్చాయి”. కరోనా సమయంలో ప్రజలు ఏ విధమైనటువంటి భయభ్రాంతులకు లోనయ్యారనే కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మెహరీన్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇందులో పద్దు అనే ఒక సాఫ్ట్ వేర్ పాత్రలో తాను కనిపిస్తానని ఇందులో ఎంతో అల్లరి చేష్టలు, ఫన్నీగా సాగిపోయే పాత్ర తనదని తెలియజేసింది. ఇక కరోనా సమయంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందారు. వాటిని ఎలా ఎదుర్కొన్నారు.. అనే అంశంపై మంచిరోజులు వచ్చాయి అనే ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కిందని వెల్లడించింది.
తనకు జీవితంలో ఓ బేబీ సినిమాలోని సమంత పాత్రలో, మహానటి సినిమాలోని కీర్తి సురేష్ లాంటి పాత్రలలో నటించాలనే కోరిక ఉందని ఈ సందర్భంగా తన మనసులోని మాటలను బయట పెట్టింది. ఇక తదుపరి తన సినిమాల విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్ 3, కన్నడలో శివరాజ్ కుమార్ సరసన మరొక సినిమా చేస్తున్నట్లు ఈ సందర్భంగా మెహరీన్ చెప్పుకొచ్చింది.