Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం షూటింగ్‌లకు విరామం ఇచ్చి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇటీవలే తన బస్సు యాత్ర కోసం పలు వాహనాలను కూడా కొనుగోలు చేశారు. అక్టోబర్ 5 నుంచి షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి 6 నెలల పాటు ఆయన బస్సు యాత్ర చేస్తారని తెలుస్తోంది. ఇక అప్పటి వరకు సినిమాలు చేసేందుకు కాల్ షీట్స్ ఇచ్చారట. అయితే ఆ గ్యాప్‌లో ఆయన వినోదయ సీతం సినిమాను పూర్తి చేస్తారని అంటున్నారు. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ ఇక అటకెక్కేసినట్లేనని అంటున్నారు.
వాస్తవానికి హరిహర వీరమల్లును ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ కోవిడ్ వల్ల ఆలస్యం అయింది. దీంతో ఎట్టకేలకు ఈ మూవీ షూటింగ్ భీమ్లా నాయక్ రిలీజ్ అనంతరం ప్రారంభం అయింది. కానీ ఈ మూవీ షూటింగ్ మళ్లీ ఆగినట్లు తెలుస్తోంది. పవన్ సూచించిన విధంగా దర్శకుడు క్రిష్ మార్పులు చేయలేదని.. కనుక ఆ మార్పులు జరిగే వరకు షూటింగ్‌ను పవన్ ఆపారని తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే అన్నీ బాగున్నాయనుకుంటే ఈ మూవీకి మరో ఆటంకం కలిగింది. పవన్ పొలిటికల్ టూర్ నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల పాటు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఈ మూవీ మరో ఆచార్య అవుతుందని మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
అప్పట్లో ఆచార్య మూవీకి కూడా ఇలాగే జరిగింది. సినిమాను అనౌన్స్ చేశాక కోవిడ్ వల్ల ఆలస్యం కాగా.. తరువాత పలు కారణాల వల్ల సినిమా విడుదల ఆగింది. తరువాత ఎట్టకేలకు సినిమాను రిలీజ్ చేసినా.. దానిపై ప్రేక్షకులకు ఆసక్తి తగ్గింది. దీంతోపాటు సినిమాకు చివరి నిమిషంలో అనేక మార్పులు చేశారు. వెరసి.. ఆచార్య ఫలితం దారుణంగా వచ్చింది. ఈ మూవీని మెగా ఫ్యాన్స్ తమ మెమొరీలోంచి తీసేయాలని చూస్తున్నారు. కానీ హరిహర వీరమల్లు కూడా ఆచార్యను తలపిస్తుందని అంటున్నారు. ఈ మూవీ కూడా ఆచార్య లాగే ఆలస్యం అయితే అప్పుడు ఫలితం కూడా ఆచార్య లాగే వస్తుందని.. దీంతో హరిహర వీరమల్లు మరో ఆచార్య అవుతుందని మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే హరిహర వీరమల్లు షూటింగ్ ఆచార్య లాగే ఆలస్యం అవుతుందా.. లేక వేగంగా పూర్తి చేస్తారా.. అన్న వివరాలు వేచి చూస్తే తెలుస్తాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…