Pelli Sandadi 2021 : సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్, యంగ్ హీరోయిన్ శ్రీలీల కలసి నటించిన పెళ్లిసందD మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌నే తెచ్చుకుంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ వహించిన మూవీ కావడంతో ఈ మూవీని చాలా మంది చూశారు. అయితే ఈ సినిమా థియేటర్లలో ఎక్కువ రోజుల పాటు ఆడలేదు. కరోనా తరువాత ఈ మూవీ రిలీజ్ కావడంతో అప్పట్లో థియేటర్లలో ప్రేక్షకులు మూవీలను చూసేందుకు ఇష్టపడలేదు. ఇంకా పలు కారణాల వల్ల ఈ మూవీ పెద్దగా హిట్ కాలేకపోయింది. కానీ ఇందులో నటించిన రోషన్, శ్రీలీల లకు మాత్రం నటనలో మంచి మార్కులే పడ్డాయి.
ఇక ఈ మూవీలో నటించిన శ్రీలీలకు ఈ మూవీ అనంతరం వరుస సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. ఈమె ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఎంతో బిజీగా ఉంది. అయితే ఈ మూవీ అక్టోబర్ 15, 2021వ తేదీన రిలీజ్ అయినప్పటికీ ఓటీటీలో మాత్రం ఇప్పటికీ రాలేదు. ఎన్నో సినిమాలు నెల రోజుల్లోపలే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. కానీ ఈ సినిమాను మాత్రం ఓటీటీలో ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. కానీ ఎట్టకేలకు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు.
జీ5 యాప్‌లో ఈ మూవీ ఈ నెల 24వ తేదీన రిలీజ్ కానుంది. ఈ మేరకు జీ5 వారు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. దీంతో ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుంది. అయితే థియేటర్లలో మంచి టాక్ వచ్చినా సినిమాను చూసేందుకు మాత్రం ప్రేక్షకులు ఆసక్తి చూపలేదు. మరిప్పుడు ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ అవుతోంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఎలాంటి టాక్‌ను తెచ్చుకుంటుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…