Acharya Movie : మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్‌తొలిసారిగా పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్రల్లో నటించిన మూవీ.. ఆచార్య. ఈ సినిమా శుక్రవారం ఏప్రిల్ 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్, పోస్టర్స్‌కు విశేష రీతిలో ఆదరణ లభిస్తోంది. దీంతో సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా.. అని మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరోనా వల్ల ఇప్పటికే రెండు సార్లు వాయిదాపడ్డ ఈ మూవీ ఎట్టకేలకు విడుదలవుతోంది. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఎప్పుడు ఏ మూవీ వచ్చినా నెగెటివ్ టాక్‌ను వ్యాపింపజేసే కొందరు ఈసారి కూడా ఆచార్యపై అలాంటి ప్రచారమే చేస్తున్నారు.
సాధారణంగా చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్.. మూవీలు ఏవైనా సరే మొదటి వారం రోజులు థియేటర్స్ ఫుల్ అయిపోతాయి. సీట్లు అసలు దొరకవు. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ కొందరు యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఇందుకు భిన్నంగా ప్రచారం చేస్తున్నారు. ఆచార్య సినిమా ప్రదర్శించబడుతున్న థియేటర్లు అన్నీ ఖాళీగానే ఉన్నాయని.. బుక్ మై షో యాప్‌లో చూస్తే మొత్తం గ్రీన్ కలర్‌లో సీట్లు ఖాళీగా ఉన్నట్లు కనిపిస్తుందని.. విమర్శిస్తున్నారు. అలాగే ఇదే విషయంపై ట్రోల్ చేస్తూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
అయితే యాంటీ ఫ్యాన్స్ చేస్తున్న నెగెటివ్ ప్రచారాన్ని మెగా అభిమానులు బాగానే తిప్పి కొడుతున్నారు. కొందరు కావాలనే ఈ మూవీపై అసత్య ప్రచారం చేస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దని, థియేటర్స్ అన్నీ ఫుల్ అవుతున్నాయని అంటున్నారు. ఈ క్రమంలోనే అటు యాంటీ ఫ్యాన్స్‌కు, ఇటు ఫ్యాన్స్‌కు మధ్య మీమ్స్, ట్రోల్స్ యుద్ధం జరుగుతోంది. అయితే వాస్తవానికి మెగాస్టార్ సినిమా అంటేనే కచ్చితంగా థియేటర్స్ ఫుల్ అవుతాయి. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ కొందరు కావాలనే పనిగట్టుకుని ఇలా మెగా ఫ్యామిలీపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని స్పష్టమవుతోంది. ఇక ఈ మూవీని కొరటాల శివ తెరకెక్కించగా.. పూజా హెగ్డె రామ్ చరణ్ పక్కన హీరోయిన్‌గా నటించింది. స్టాలిన్ మూవీ తరువాత చాలా సంవత్సరాలకు మణిశర్మ మెగాస్టార్ చిరంజీవి సినిమాకు సంగీతం అందించడం విశేషం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…