Mega Daughters : స్వయంకృషితో ఉన్నత స్థాయికి చేరుకున్న చిరంజీవి మెగాస్టార్‌గా అభిమానుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన వేసిన బాటలో మెగా హీరోలు నడుస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయితేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ మెగా ఫ్యామిలీ ద్వారా వచ్చిన గుర్తింపు వల్ల ఇండస్ట్రీలో హీరోలుగా నిలదొక్కుకున్నారు. అయితే వీరు ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా స్లో అండ్ స్టడీగా తమ కెరీర్ కొనసాగిస్తూ వస్తున్నారు. కానీ మెగా డాటర్స్ మాత్రం పలు విషయాలతో హాట్ టాపిక్ అవుతున్నారు.

చిరంజీవి పెద్ద కూతురు సుస్మితకు ఉదయ్ కిరణ్ తో పెళ్లి చేయాలని మెగాస్టార్ చిరంజీవి భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ వివాహం జరగలేదు. ఎంగేజ్‌మెంట్ వరకు వెళ్లి క్యాన్సిల్ కావడంతో ఈ విషయం అప్పట్లో బాగా చర్చనీయాంశం అయింది. ఇక శ్రీజ కుటుంబ సభ్యులకు చెప్పకుండా తాను ప్రేమించిన శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంది. అయితే వివాహం అనంతరం భర్తతో విభేదాలు రావడంతో శ్రీజ విడాకులు తీసుకుంది. శ్రీజ పెళ్లి సమయంలో పవన్ కళ్యాణ్ గన్ చేత పట్టుకోవడం వరకు వెళ్లింది. ఇక శిరీష్‌తో పలు ఇష్యూస్ వలన విడిపోయిన శ్రీజ.. కళ్యాణ్ దేవ్ ని వివాహం చేసుకుంది.
శ్రీజ, కళ్యాణ్ దేవ్ కూడా విడిపోయారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయనే సంగతి తెలిసిందే. ఇక నాగబాబు కూతురు నిహారిక కొన్నాళ్లపాటు వివాదాలకు దూరంగా ఉంది. తాజాగా ఈమె డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో ఇప్పుడు అందరి దృష్టి నిహారికపై పడింది. భర్త లేకుండా ఉగాది రోజు నిహారిక పబ్‌కి వెళ్లడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యంలోకి నెట్టింది. కొందరు నిహారికతోపాటు మెగా ఫ్యామిలీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇలా మెగా ఫ్యామిలీ ఆడపడుచులు వివాదాల్లో చిక్కుకోవడం.. వారి ఫ్యామిలీకి శాపమా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.