Meera Jasmine : తెలుగులో పలు హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ మీరా జాస్మిన్ గుర్తుంది కదా. ఈమె అప్పట్లో పెద్దగా గ్లామర్ షో చేయలేదు. అయినప్పటికీ ఈమె నటించిన పలు చిత్రాలు హిట్ అయ్యాయి. దీంతో వరుస సినిమాల్లో ఈ బ్యూటీ ఆఫర్లను దక్కించుకుంది. అయితే ఆ చిత్రాలు ఫ్లాప్ కావడంతో ఈమె నెమ్మదిగా వెండి తెరకు దూరమైంది. కానీ ఇప్పుడు ఈమె రూటు మార్చినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లకు పోటీగా అందాల ప్రదర్శనలో తానేమీ తక్కువ కాదని నిరూపిస్తోంది. దర్శక నిర్మాతలకు తాను కూడా పోటీలో ఉన్నానని చెబుతోంది.

మీరా జాస్మిన్ అప్పట్లో రన్ అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. తరువాత ఆమె బాలకృష్ణతో కలిసి మహారథి అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా పెద్దగా హిట్ కాలేదు. కానీ తరువాత మాస్ మహారాజ రవితేజతో కలిసి నటించిన భద్ర ఈమెకు మంచి బ్రేక్ ఇచ్చింది. దీంతో ఈమెకు పలు సినిమాల్లో వరుస ఆఫర్లు వచ్చాయి. తరువాత ఆమె జగపతిబాబుతో బంగారు బాబు, రాజశేఖర్‌తో గోరింటాకు, గోపీచంద్‌తో ఒంటరి, పవన్ కల్యాణ్‌తో గుడుంబా శంకర్ వంటి చిత్రాలలో నటించింది.
అయితే ఆయా సినిమాలు హిట్ కాలేదు. దీంతో ఆమె కొంతకాలం వెండితెరకు దూరంగా ఉంది. ఇక ఇప్పుడు తాజాగా ఈమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టినట్లు స్పష్టమవుతోంది. తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్‌లో ఈమె దిగిన ఫోటోలను షేర్ చేసింది. వాటిల్లో మీరా జాస్మిన్ అందాలను ఒక రేంజ్‌లో ఆరబోసింది.
చూస్తుంటే ఈ అమ్మడు కొద్దిగా ఫిగర్ ను మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇక కోటును పక్కకు తప్పించి ఎద అందాలను ప్రదర్శిస్తూ మీరా జాస్మిన్ చేస్తున్న గ్లామర్ షోను చూసి యువత గుండెల్లో గుబులు పుడుతోంది.
ఈమె ప్రస్తుతం మళయాళంలో ఓ చిత్రంలో నటిస్తోంది. ఈ క్రమంలోనే ఈమె చేస్తున్న గ్లామర్ షోను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు ఈమె గ్లామర్ షోకు ఆమడ దూరంలో ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితిలో గ్లామర్‌గా కనిపించాల్సి వస్తోంది. అందుకనే ఈమె ఈ రూటును ఎంచుకున్నట్లు తెలుస్తోంది.