Meena : 1990 దశాబ్దంలో టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో మీనా ఒకరు. తమిళనాడులో పుట్టి పెరిగిన మీనా తెలుగుతోపాటు తమిళ, మళయాళ, హిందీ భాషల్లో దాదాపు ఇరవైకి పైగా చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు సంపాదించుకుంది. మీనా తండ్రి మద్రాస్ లో ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. తల్లి పేరు రాజమల్లిక. మీనా తల్లి సైతం హీరోయిన్ గా కొన్ని చిత్రాలలో నటించడం జరిగింది. తల్లి రాజమల్లిక సినీ వారసురాలిగా మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయమయ్యారు. 1990లో నవయుగం చిత్రం ద్వారా హీరోయిన్ గా వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. తెలుగుతో పాటు అనేక భాషల్లో నటించి నటన పరంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు మీనా. తెలుగు, తమిళ్ వంటి భాషలలో అందరు అగ్రస్థాయి హీరోలతో నటించి తన నటనకు మంచి గుర్తింపుతో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నారు.
మీనా సినిమాల్లో నటిస్తున్నంత కాలం వివాదాలకు చాలా దూరంగా ఉండేవారు. సాధారణంగా ఒక టాప్ గ్లామరస్ హీరోయిన్ అంటే ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ వార్తలలో పేరు వినిపిస్తూనే ఉంటుంది. కానీ మీనా మాత్రం దీనికి భిన్నంగా వివాదాలకు పూర్తిగా దూరంగా ఉండేవారు. ఇక అవకాశాలు తగ్గుతున్న సమయంలో సినిమాలకు స్వస్తి చెప్పి పెద్దలు కుదిర్చిన సంబంధంతో విద్యాసాగర్ అనే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని వివాహం చేసుకుంది. విద్యాసాగర్, మీనా దంపతులకు నైనిక అనే కూతురు ఉంది. నైనికా సైతం చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది జూన్ 28న మీనా భర్త విద్యాసాగర్ లంగ్ ఇన్‌ఫెక్షన్‌తో మరణించడం జరిగింది.
భర్త మరణంతో మీనాపై సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ప్రస్తుతం విద్యాసాగర్ మీనాతో పెళ్లికి సంబంధించిన ఒక వార్త సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారుతోంది. సినిమాలు ఆపేసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత మీనా కోసం ఆమె తల్లి రాజమల్లిక అనేక పెళ్లి సంబంధాలను చూసిందట. పెళ్లి సంబంధాలు వెతుకుతున్నట్లు తెలిసిన మీనా మేనత్త విద్యాసాగర్ ను పెళ్లి చేసుకోవాలని వారికి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందట. మీనా, విద్యాసాగర్ ఒకరికి ఒకరు వ్యక్తిగతంగా మాట్లాడుకున్న తరువాత విద్యాసాగర్ అభిప్రాయాలు తన అభిప్రాయాలు వేరుగా ఉండటం అలాగే వృత్తులు కూడా కలవకపోవడంతో అతడికి నో చెప్పేసిందట మీనా. దాంతో ఎంతో వినయంగా ఆల్ ద బెస్ట్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయాడట విద్యాసాగర్.
కానీ మీనా మేనత్త అబ్బాయి చాలా మంచివాడు ఒప్పుకో అని మీనాను బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పించిందట. విద్యాసాగర్ లాంటి వ్యక్తిని కోల్పోతే జీవితంలో మళ్ళీ అలాంటి మంచి అబ్బాయిని పొందలేవని గట్టిగా చెప్పిందట. దాంతో మరోమారు కలిసి మాట్లాడి విద్యాసాగర్ తో పెళ్లికి ఓకే చెప్పిందట మీనా. ఇంత మంచి వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు నేను ఎంతో అదృష్టవంతురాలిని. నన్ను బాగా అర్థం చేసుకున్న భర్త దొరికాడు. ఎవరో బలవంతం మీద పెళ్ళి చేసుకున్నందుకు నేను ఎప్పుడూ విచారించలేదు అంటూ పలు సందర్భాల్లో మీనా వెల్లడించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తూ విద్యాసాగర్ కన్నుమూయడంతో మీనా విషాదంలో నిండిపోయింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…