Tejaswi Madivada : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో పాపులర్ అయిన తేజస్వి మడివాడ ఆ తరువాత కూడా చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఇంకా పెద్ద స్థాయికి వెళ్లలేక పోయింది. అప్పుడప్పుడూ కొన్ని సినిమాల్లో మెరుస్తూ అలాగే మరికొన్ని టీవీ షోల్లో కూడా కనిపిస్తోంది. అవి కూడా పెద్దగా ఆదరణ లేని షోలు గానే మిగిలిపోయాయి. కానీ గత కొంతకాలంగా తను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కు ఇచ్చిన ఇంటర్య్వూల్లో సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై ఆమె చేసిన వాఖ్యలు మాత్రం బాగా వైరల్ అయ్యాయి.
ఇక ఈమె బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో తేజస్వికి, అదే సీజన్ లో విజేతగా నిలిచిన కౌశల్ కి మధ్య జరిగిన గొడవలను కూడా ఎవరూ మర్చిపోరు. ఒకానొక సమయంలో ఆ సీజన్ లో వారిద్దరి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకరినొకరు అసభ్య పదజాలంతో తిట్టుకోవడం కూడా జరిగింది. అయితే తేజస్వి మాత్రం వారిద్దరి మధ్య జరిగిన గొడవల కారణంగా తన లైఫ్ పూర్తిగా మారిపోయిందని ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్య్వూ లో చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఆ సమయంలో కౌశల్ ఆర్మీ కూడా సోషల్ మీడియాలో తన మీద అసభ్యకరమైన మీమ్స్ చేయడం, తనని అసభ్యంగా దూషించడం లాంటివి చేశారని ఆరోపించింది.
ఇక ఇది జరిగిన 4 ఏళ్ల తరువాత ఆ షో వలన తైజస్వి తనకు జరిగిన నష్టాన్ని ఇప్పుడు వివరించింది. కౌశల్ ఆర్మీ తనను తరచూ ఎంతో మానసిక క్షోభకు గురి చేశారని, దాని వలన తాను మద్యానికి బానిస అయ్యానని, డిప్రెషన్ కి గురయ్యానని తెలిపింది. కేవలం సింపతీతోనే కౌశల్ గెలుపొందాడని విమర్శించింది. మరోవైపు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తేజస్వి నటించిన కమిట్‌మెంట్ అనే సినిమా విడుదల కాబోతున్న ఈ సమయంలో ఆమె ఇలాంటి వాఖ్యలు చేయడం పబ్లిసిటీ కోసమే అని అంటున్నారు. తన కెరీర్ లో వచ్చిన గ్యాప్ ని కవర్ చేయడానికి ఆమె ఈ విధంగా ఎప్పుడో జరిగిన వివాదాన్ని ఇప్పుడు వాడుకుంటుందని ఆరోపిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…