Mayanti Langer : క్రికెట్ మ్యాచ్‌ల సందర్బంగా యాంకరింగ్ చేసే ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్.. మయంతి లాంగర్ గుర్తుంది కదా. అవును.. ఆమే.. ఆమె చాలా కాలం నుంచి యాంకర్‌గా పనిచేయడం లేదు. క్రికెట్ మ్యాచ్ లు జరిగినప్పుడల్లా ఆమె యాంకరింగ్ చేస్తూ సందడి చేస్తుంటుంది. స్టార్ స్పోర్ట్స్ ఐపీఎల్ ప్రసార హక్కులను కొనుగోలు చేసినప్పటి నుంచి చాలా సీజన్లలో మయంతి లాంగర్ యాంకర్‌గా పనిచేసింది. అయితే ఉన్నట్లుండి ఆమె సడెన్‌గా మాయమైంది. క్రికెట్ టోర్నమెంట్‌లలో యాంకర్‌గా వేరే వాళ్లు వస్తున్నారు. ఐపీఎల్‌లోనూ వేరే యాంకర్లు కనిపిస్తున్నారు. కానీ మయంతి లాంగర్ మాత్రం కనిపించడం లేదు. అయితే ఆమె యాంకరింగ్ చేయకపోవడానికి గల కారణాలు ఏమిటి ? అన్న విషయాలను ఒక్కసారి పరిశీలిస్తే..

ఐపీఎల్ 2020 సీజన్ నుంచి మయంతి లాంగర్ మనకు కనిపించడం లేదు. ఆమె క్రికెట్ ప్లేయర్ స్టువర్ట్ బిన్నీని వివాహం చేసుకున్న విషయం విదితమే. అయితే ఐపీఎల్ 2020 సీజన్ సమయంలో ఆమె గర్భవతి అయి ప్రసవించింది. అందుకనే ఆ సీజన్‌కు ఆమె యాంకర్‌గా రాలేదు. తాను ఐపీఎల్‌ను చాలా మిస్ అవుతున్నానని.. ప్రస్తుతం తనకు సంతానం కలిగినందున తాను ఐపీఎల్‌లో యాంకర్‌గా రాలేనని.. అవకాశం ఉంటే మళ్లీ వస్తానని.. ఆమె స్వయంగా అప్పట్లో తెలియజేసింది. అయితే ఈ వార్త అంతగా ప్రచారం కాలేదు, కనుక మయంతికి ఏమైంది ? అనే విషయం చాలా మందికి తెలియలేదు.
Mayanti Langer : గుర్తు పట్టరాకుండా మారింది..
అయితే ప్రసవించిన తరువాత కూడా మయంతి లాంగర్ అనేక విధాలుగా మారిపోయింది. అంతకు ముందు ముద్దుగా బొద్దుగా ఉండే ఈమె తరువాత గుర్తు పట్టరాకుండా మారింది. పూర్తిగా బలహీనంగా కనిపించింది. సహజంగానే ప్రసవానంతరం మహిళలు చాలా మంది మారిపోతారు. కొందరు సన్నగా అయితే కొందరు విపరీతంగా లావు పెరుగుతారు. మయంతి కూడా ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటోంది. మరో వైపు భర్త స్టువర్ట్ బిన్నీ కూడా ఐపీఎల్‌లో ఏ ఒక్క జట్టులోనూ స్థానం దక్కించుకోలేకపోయాడు. దీంతో అన్ని విధాలుగా ఆ ప్రపంచానికి దూరంగా ఉండడమే మంచిదని మయంతి లాంగర్ భావించింది. కనుకనే ఆమె యాంకర్‌గా మనకు కనిపించడం లేదు.
అయితే ఈమె మళ్లీ తన యథా రూపాన్ని పొందితే అప్పుడు ఈమెను మళ్లీ మనం క్రికెట్ మ్యాచ్‌లలో చూసేందుకు అవకాశం ఉంటుంది. మరి ఆమె మళ్లీ వచ్చి యాంకరింగ్ చేస్తుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.