Marakkar : సాధారణంగా ఒక సినిమా విడుదల అవుతుందంటే ఆ సినిమా క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని ముందుగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉంటారు. ఇలా ఒక వారం ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ లు పూర్తి అవుతాయి. అయితే ఈ విధంగా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలను దక్కించుకుంటారు. కానీ ఒక సినిమా కేవలం అడ్వాన్స్ బుకింగ్ తోనే రూ.100 కోట్లను కొల్లగొట్టడం గురించి ఎప్పుడైనా విన్నారా. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
మాలీవుడ్ భారీ బడ్జెట్ ఫిల్మ్ ‘మరక్కార్ : అరబికడలింటే సింహం’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మోహన్ లాల్ నటించిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ లో భాగంగా ఏకంగా రూ.100 కోట్లను కొల్లగొట్టినట్లు మోహన్ లాల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ విషయం వైరల్ గా మారడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.
ఆంటోని పెరంబవూర్ నిర్మించిన ఈ సినిమాలో అర్జున్ సర్జా, సునీల్ శెట్టి, మంజు వారియర్‌తోపాటు సిద్ధిక్ ప్రధాన పాత్రలలో నటించారు. ముందుగా ఓటీటీలో విడుదల చేయాలని భావించినా.. ఈ సినిమాను తిరిగి థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈ సినిమా 4,100 స్క్రీన్స్‌లో 16 వేల షోస్‌తో విడుదలవుతున్నట్టు తెలిపిన మోహన్ లాల్.. టికెట్ బుకింగ్స్ ద్వారానే రూ.100 కోట్ల క్లబ్‌లో అడుగు పెట్టినట్లు తెలిపారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…