Akhanda Movie : బాల‌కృష్ణ‌కు ఏపీ ప్ర‌భుత్వం షాక్‌.. అఖండ సినిమాకు చిక్కులు..

Akhanda Movie : నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీ‌నుల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మ‌రో సినిమా.. అఖండ‌. ఈ మూవీకి గాను ఇప్ప‌టికే విడుద‌ల చేసిన టీజ‌ర్స్‌, పోస్ట‌ర్స్, పాట‌లు ప్రేక్ష‌కుల్లో మ‌రిన్ని అంచ‌నాల‌ను పెంచాయి. ఈ క్ర‌మంలో ఈ సినిమా కోసం నంద‌మూరి అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ వ‌చ్చారు. డిసెంబ‌ర్ 2న ఈ మూవీ థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో అఖండ మూవీకి షాక్ ఇచ్చిన‌ట్ల‌యింది. దీంతో ఈ మూవీ చిక్కుల్లో ప‌డిపోయింది.

Akhanda Movie : ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం వ‌ల్ల ఎదురు దెబ్బ

ఏపీ ప్ర‌భుత్వం ఇటీవ‌లే సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న విష‌యం విదిత‌మే. టిక్కెట్ల రేట్ల‌ను త‌గ్గించ‌డంతోపాటు అన్నింటినీ ఆన్‌లైన్‌లోనే విక్ర‌యించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతోపాటు బెనిఫిట్ షోలు, ఎక్స్ ట్రా షోల‌ను ర‌ద్దు చేశారు. ఇలా ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం టాలీవుడ్‌ను ఇబ్బందుల్లోకి నెట్టివేసింది. అస‌లే క‌రోనా వ‌ల్ల టాలీవుడ్ ప‌రిశ్ర‌మ తీవ్ర న‌ష్టాల్లో ఉంది. దీంతో ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం వ‌ల్ల మ‌రో ఎదురు దెబ్బ త‌గిలిన‌ట్లు అయింది. ఈ విధంగా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌డంతో రానున్న కాలంలో విడుద‌ల‌య్యే ఏ సినిమా కూడా వ‌సూళ్ల‌ను సాధించ‌లేద‌ని అంటున్నారు.

CM YS Jagan Government given Shock to Balakrishna Akhanda Movie

క‌రోనా నేప‌థ్యంలో గ‌త 2 సంవ‌త్స‌రాల నుంచి అన్ని చిత్ర ప‌రిశ్ర‌మ‌లు న‌ష్టాల్లోనే ఉన్నాయి. దేశంలో ఎక్క‌డా సినిమాల‌కు లాభాలు రావ‌డం లేదు. క‌నీసం షో లు న‌డిస్తే చాల‌నే ప‌రిస్థితి ఉంది. ఈ నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం పుండు మీద కారం చ‌ల్లిన‌ట్లు అయింది. టిక్కెట్ల‌ను గ‌రిష్టంగా రూ.240కి మాత్ర‌మే అమ్ముకునే వెసులు బాటు ఉంది. అది కూడా మ‌ల్టీప్లెక్స్‌ల‌లోనే. ఇలా ధ‌ర‌లు ఉంటే ఏ సినిమాకు కూడా లాభాలు రావ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఈ మ‌ధ్యే ఏపీ ప్ర‌భుత్వం బిల్లును కూడా పాస్ చేసింది. దీంతో సినిమాల‌కు గ‌డ్డు కాలం వ‌చ్చింద‌ని అంటున్నారు.

ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న తాజా నిర్ణ‌యంతో మొద‌ట‌గా బాల‌కృష్ణ‌నే చిక్కుల్లో ప‌డ్డారు. అఖండ మూవీని బాల‌కృష్ణ ఎంతో ఇష్టంగా పూర్తి చేశార‌ట‌. ఈ క్ర‌మంలోనే ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా మూవీని విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే మూవీ హిట్ టాక్ వ‌చ్చినా.. ఏపీలో టిక్కెట్ల రేట్లు త‌క్కువ‌గా ఉండ‌డం, ప్ర‌త్యేక షోలు లేని కార‌ణంగా.. అక్క‌డ న‌ష్టాలే వ‌స్తాయ‌ని అంటున్నారు. దీంతో నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్లు, బ‌య్య‌ర్లు, థియేట‌ర్ల ఓన‌ర్లు పూర్తిగా న‌ష్ట‌పోతామ‌ని అంటున్నారు. కోవిడ్ రెండో ద‌శ అనంత‌రం అనేక చిత్రాలు ఓటీటీల్లోనే విడుద‌ల‌య్యాయి. ఇక బాల‌య్య అఖండ‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు. మ‌రి ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం అఖండ మూవీపై ఎలాంటి ప్ర‌భావం చూపిస్తుందో వేచి చూస్తే తెలుస్తుంది.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM