Manchu Vishnu : ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. రెండు ఫ్యామిలీల మధ్య వివాదం ఇప్పటిది కాదు. టాలీవుడ్ వజ్రోత్సవ వేడుకల సమయంలో అవార్డుల విషయమై గొడవ జరిగింది. చిరంజీవికి లెజెండరీ పురస్కారం ఇచ్చి, మోహన్ బాబుకు ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్, మోహన్ బాబు మధ్య వార్ నడిచింది. ఇక అది జరిగి ఏళ్లు కాగా మధ్యలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో మంచు ఫ్యామిలీ సన్నిహితంగానే ఉంది.
ఇటీవల జరిగిన మా ఎన్నికలు రెండు కుటుంబాల మధ్య మళ్లీ అగ్గిని రాజేశాయి. మెగా ఫ్యామిలీ మంచు విష్ణు ప్రత్యర్థి ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేయడంతో అగ్గి రాజుకుంది. మంచు విష్ణు ఓ సందర్భంలో చిరంజీవి అంకుల్ నన్ను ఎన్నికల నుండి తప్పుకోమన్నారంటూ ఓపెన్ కామెంట్స్ చేశారు. ఇక ఈ ఎన్నికల సమయంలో నాగబాబు, మంచు విష్ణు, మోహన్ బాబుల మధ్య జరిగిన మాటల యుద్ధం పీక్స్ కి వెళ్లిన విషయం తెలిసిందే. నాగబాబు ఇటీవల మోహన్ బాబు సినిమాను ఉద్దేశిస్తూ వ్యంగ్యాస్త్రాలు వదిలారు. తన అభిమానులతో చిట్ చాట్ లో పాల్గొన్న ఆయన కేజీఎఫ్, ఆర్ ఆర్ ఆర్ చిత్రాల్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏది అని అడిగారు. దానికి నాగబాబు రెండూ కాదు ఓ లెజెండరీ గ్రాఫిక్స్ మూవీ.. అంటూ సమాధానం చెప్పారు.
సమయం దొరికినప్పుడల్లా ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు వదులుతున్నారు. అయితే తాజాగా విడుదలైన ఆచార్య చిత్రం తొలి షో నుండే డివైడ్ టాక్‌తో నడుస్తున్న క్రమంలో మంచు విష్ణు ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంచు విష్ణు తన ట్వీట్‌లో రాస్తూ.. డాన్స్ రిహార్సల్స్ మొదలయ్యాయి. దీంతో ఒళ్ళంతా నొప్పులు.. అంటూ విష్ణు ట్వీట్ చేశారు. మంచు విష్ణు ట్వీట్ చేసే సమయానికి యూఎస్ ప్రీమియర్స్ నుంచి ఆచార్య చిత్రానికి టాక్ మొదలైపోయింది. టాక్ ఆశించిన విధంగా లేదు. మిశ్రమ స్పందన వస్తోంది.. అనే సరికి మంచు విష్ణు దానిపై ఇలా సెటైరికల్ ట్వీట్ చేశారని కొందరు అనుకుంటున్నారు. ప్రస్తుతం మంచు విష్ణు గాలి నాగేశ్వర రావు అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో డాన్స్ గురించే విష్ణు ట్వీట్ చేసి ఉండొచ్చని.. మరి కొందరు అంటున్నారు. అయితే విష్ణు ఇలా ట్వీట్ చేయడంతో ఆయన ట్వీట్ వైరల్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…