Manchu Vishnu : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలలో ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు 107 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తనను తెలుగు వాడిగా యాక్సెప్ట్ చేయని కారణంగా ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. లోకల్, నాన్ లోకల్ అనే గొడవ బాగా ప్రభావం చూపిందనే చెప్పాలి. దీంతో ప్రకాశ్ రాజ్ తాను మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు.
కళాకారుడిగా తనకు ఆత్మగౌరవం ఉందని, అందుకే రాజీనామా చేస్తున్నానని తెలిపారు. తన ఓటమిని అంగీకరిస్తున్నానని ప్రకాశ్ రాజ్ చెప్పారు. తన తల్లిదండ్రులు తెలుగువారు కాకపోవడం తన తప్పు కాదని ఆయన అన్నారు. అతిథిగా వచ్చానని, అతిథిగానే తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగుతానని చెప్పారు ప్రకాశ్ రాజ్. అయితే ఈ క్రమంలోనే మంచు విష్ణుకు అభి నందనలు తెలుపుతూ మా సభ్వత్వానికి తన రాజీనామాను యాక్సెప్ట్ చేయమని, మా లో నాన్ మెంబర్ గా తన సేవలందిస్తానని అన్నాడు.
https://twitter.com/iVishnuManchu/status/1447478421227925505?s=20
వాట్సాప్‌లో పర్సనల్‌గా ప్రకాశ్ రాజ్ మెసేజ్ పెట్టడంతో దానిని సోషల్ మీడియాలో షేర్ చేసిన విష్ణు.. డియర్ అంకుల్ మీ అభినందనలకి థాంక్స్. కానీ మీ నిర్ణయానికి నేను బాధపడుతున్నాను. మీరు నాకన్నా పెద్దవారు. మీకు తెలుసు కదా.. గెలుపు, ఓటములు బొమ్మా, బొరుసు లాంటివని. మా కుటుంబంలో మీరు కూడా సభ్యులే. నాకు మీ ఐడియాస్ కావాలి. మనిద్దరం కలిసి పనిచేద్దాం. మళ్లీ నాకు రిప్లై ఇవ్వొద్దని కోరుతున్నాను. త్వరలోనే మిమల్ని కలుస్తాను.. అని విష్ణు రిప్లై ఇచ్చారు. ఇప్పుడు ఈ ఇద్దరి ఛాటింగ్ చర్చనీయాంశంగా మారింది.