Manchu Vishnu : మంచు విష్ణు అంటే టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు. చివరగా మంచు విష్ణు మోసగాళ్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు దీపావళి కానుకగా అక్టోబర్ 21న.. మంచు విష్ణు నటించిన తొలి పాన్ ఇండియా సినిమా జిన్నా విడుదలైంది. ఈ సినిమాలో సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకి ప్రేక్షకులు నుంచి పాజిటివ్ టాక్ వస్తోందని చెప్పుకొచ్చిన మంచు విష్ణు.. గత రెండు సినిమాలతో పోలిస్తే ఈ మూవీ టాక్ విషయంలో కాస్త బెటర్ అని వెల్లడించాడు.
ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు విష్ణు ఇంకా ఏమన్నాడంటే? నా ఫ్రెండ్స్ చెప్పే సినిమా రివ్యూని నేను పట్టించుకోను. తెలిసినవాళ్లు కాబట్టి.. వాళ్లు మూవీ చూసే తీరు వేరుగా ఉంటుంది. కానీ బయటి వ్యక్తులు ఇచ్చే రివ్యూలని మాత్రం నమ్ముతా. జిన్నా సినిమాని ఎవరూ అద్భుతం అని చెప్పలేదు. కానీ బావుంది అనడం హ్యాపీగా ఉంది అని చెప్పుకొచ్చాడు. ట్రోలర్స్‌కి ఇటీవల వార్నింగ్ ఇవ్వడంపై కూడా మంచు విష్ణు స్పందించాడు. వాళ్లు ఇండస్ట్రీకి చెందిన వారు. మేము కూడా ఇక్కడే ఉంటున్నాం.

కాబట్టి ఇప్పుడు ఆ వివరాలు చెప్తే? కడుపు చించుకుంటే కాళ్ల మీదే పడినట్లు అవుతుంది. అయితే జిన్నా సినిమా తర్వాత స్నో అన్నకి హిట్ పడింది అని వాళ్లే ట్రోల్ చేస్తున్నారు. ఒకరకంగా ఇది పాజిటివ్. ఇక్కడ స్నో అనే పేరు పెట్టింది నేనే. గేమ్ ఆఫ్ థ్రోన్ జాన్ స్నో క్యారెక్టర్ ఆధారంగా ఆ పేరు పెట్టా. చివరికి ఆ పేరుతోనే మా ఫ్యామిలీని ట్రోల్ చేస్తున్నారు అని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. వాస్తవానికి ట్రోలర్స్ తమకి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ పేర్లని పెడుతుంటారు. అలానే మంచు ఫ్యామిలీని స్నో ఫ్యామిలీ అంటూ ట్రోల్ చేస్తుంటారు అని చెప్పుకొచ్చాడు విష్ణు.