మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ జిన్నా. పూర్తి యాక్షన్, కమర్షియల్, ఎంటర్‌టైనింగ్ మూవీగా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. చాలాకాలంగా సరైన హిట్ లేని మంచు విష్ణుకు ఈ సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వస్తాడని ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. అంతేకాదు జిన్నా సినిమాలో అందాల భామలు పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ నటిస్తుండటంతో ఈ సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. ఇటీవల మూవీ నుంచి మంచు విష్ణు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. హీరోయిన్స్ తో ఉన్న సరికొత్త రొమాంటిక్ పోస్టర్ ను ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా నిజానికి అక్టోబర్ 5న దసరా సందర్భంగా విడుదల కావాల్సి ఉంది.
కానీ, గాడ్ ఫాదర్, ఘోస్ట్ సినిమాలు ఉండటంతో జిన్నా సినిమాని వాయిదా వేసుకున్నారు. అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా జిన్నా సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి జారు మిఠాయా అనే సాంగ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఆ సాంగ్ యూట్యూబ్‌లో తెగ వైరల్ అవుతోంది. మంచు విష్ణు- సన్నీ లియోన్ వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. అంతేకాకుండా డాన్స్ పరంగానూ విష్ణు చాలా మెరుగైనట్లు కితాబిస్తున్నారు. ఏకంగా మంచు విష్ణు డాన్స్ మూమెంట్స్ వీడియో కట్ చేసి స్టార్ అల్లు అర్జున్ సాంగ్‌తో కంపేర్ చేసి వీడియో వైరల్ చేస్తున్నారు.
డాన్స్‌లో మంచు విష్ణు ఎంతో ఇంప్రూవ్ అయ్యాడని చెప్పేందుకు ఈ క్లిప్ చాలంటూ కామెంట్ చేస్తున్నారు. బద్రీనాథ్ సినిమాలోని నాథ్ నాథ్ నీలో బద్రీనాథ్ సాంగ్‌లో ఒక మ్యూజిక్ బిట్ ఉంటుంది. దానికి బన్నీ ఆగకుండా తన మూవ్స్ తో అందరినీ మెస్మరైజ్ చేశాడు. ఇప్పుడు సేమ్ అలాంటి మూమెంట్స్ తో మంచు విష్ణు కూడా ప్రేక్షకులను అలరించనున్నాడు. అల్లు అర్జున్- మంచు విష్ణులను పక్క పక్కన పెట్టి ఆ ట్రాక్, జారు మిఠాయా ట్రాక్ యాడ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో కూడా యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. మరి.. ఆ వైరల్ వీడియో మీరూ చూసేయండి.
https://youtu.be/BgQfS_KOejo