Manchu Vishnu : విష్ణు చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు మంచు విష్ణు. ఢీ, దేనికైనా రెడీ, డైనమైట్, ఆడోరకం ఈడోరకం వంటి చిత్రాలలో నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు విష్ణు. కానీ మంచు విష్ణు కమర్షియల్ గా సక్సెస్ ను అందుకొని చాలా రోజులు అయింది. మా అధ్యక్షుడిగా ప్రస్తుతం పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు మంచి విష్ణు. కానీ సొట్టబుగ్గల హీరో సోషల్ మీడియాలో ద్వారా తన ఫన్నీ వీడియోస్ ను అభిమానులతో పంచుకుంటున్నారు. అంతేకాకుండా విష్ణు మా అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ చేసిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటల తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.
మీమర్స్ సైతం మంచు విష్ణు మాటలను మీమ్స్ రూపంలో ట్రోల్ చెయ్యటమే కాకుండా మంచు ఫ్యామిలీని కూడా తెగ ఆడుకుంటూ ఉంటారు. మీమ్స్ రూపంలోనే కాకుండా మంచు ఫ్యామిలీ మాట్లాడే తీరుపై వీడియోస్ కూడా సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తూ ఉంటాయి. మంచు కుటుంబం నిత్యం ఏదో ఒక రూపంలో ట్రోలింగ్ కి గురవుతూనే ఉన్నారు. మంచు విష్ణు ప్రస్తుతం జిన్నా అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సన్నీ లియోన్, పాయల్ రాజ్ పూత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో నటిస్తున్న సందర్భంలో సన్నీలియోన్ తో చేసిన కొన్ని కామెడీ వీడియోస్ కూడా నెట్టింట్లో వైరల్ కావడమే కాకుండా నెటిజన్ల నుంచి బాగా ట్రోలింగ్ ను ఎదుర్కోవటం జరిగింది.

గత కొంతకాలం క్రితం సన్ ఆఫ్ ఇండియా చిత్రం మీద జరిగిన ట్రోలింగ్ హద్దులు దాటుతుంది అంటూ మంచు ఫ్యామిలీ రంగంలో దిగటం జరిగింది. హద్దులు దాటుతూ కామెంట్స్ చేసే వారిపై రూ.10 కోట్ల వరకు పరువు నష్టం దావా వేస్తామని మంచు ఫ్యామిలీ ప్రెస్ మీట్ పెట్టి మరి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. నెటిజన్లు ఈ వార్నింగ్ ను కూడా తమదైన శైలిలో ట్రోల్ చేస్తూ తెగ ఆడుకున్నారు. ప్రస్తుతం మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటో చూస్తే నెటిజన్లు ఊరుకుంటారా.. తమదైన స్టైల్‌లో మీమ్స్ రూపంలో కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయటం మొదలు పెట్టారు. ఏంటి మా అధ్యక్షుడు మంచు విష్ణుకి బాత్రూం లేదా.. మరీ నడిరోడ్డుపై ఏంటి ఈ పని అంటూ.. ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టేశారు. ఇక విష్ణు నటిస్తున్న జిన్నా మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది.