Manchu Vishnu : మంచు విష్ణు చాలా గ్యాప్ తరువాత నటిస్తు్న చిత్రం.. గాలి నాగేశ్వర్ రావు. ఈ మూవీలో సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పూత్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా.. షూటింగ్ పనులను శరవేగంగా చేపడుతున్నారు. కామెడీ జోనర్‌లోఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. మంచు విష్ణు సోదరుడు మంచు మనోజ్ హీరోగా వచ్చిన కరెంటు తీగలోనూ సన్నీ లియోన్ మెరిసింది. ఆ తరువాత ఇప్పుడు తన సోదరుడి సినిమాలో ఈమె నటిస్తోంది. ఇక షూటింగ్ కారణంగా గత కొంత కాలంగా సన్నీ లియోన్ హైదరాబాద్‌లోనే ఉంటోంది.
అయితే ఖాళీ దొరికినప్పుడల్లా మంచు విష్ణు, సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పూత్‌లు సరదాగా గడుపుతూనే ఉన్నారు. ఈ మధ్యే వారు ఓ ఫన్నీ సంఘటనలో పాలు పంచుకున్నారు. సన్నీ, పాయల్ ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారని అడగ్గా.. విష్ణు ఒక్కోసారి ఒకరి పేరు చెప్పారు. తరువాత ఎవరూ కాదు.. అన్నారు. దీంతో ఇద్దరూ విష్ణును చితకబాదారు. అయితే ఇప్పుడు విష్ణు అలాంటి ఓ చిలిపి పని చేశారు. సన్నీ లియోన్‌కు ముద్దు ఇస్తున్నట్లు పోజు పెట్టారు. అదే ఫొటోలో పాయల్ రాజ్‌పూత్ విక్టరీ సింబల్ ను చూపిస్తోంది. కాగా ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారింది.
కాగా ఈ ఫొటోను చూసి నెటిజన్లు అనేక రకాలుగా స్పందిస్తున్నారు. మంచు విష్ణుకు రొమాన్స్ ఎక్కువైందని కొందరు అంటుండగా.. పబ్లిగ్గా ఇలాంటి పనులేంటి అని విమర్శిస్తున్నారు. గతంలోనూ ఓ సారి సన్నీ లియోన్ వీపు మీద ఆమ్లెట్ వేయాలని చూసి నెటిజన్లచే విష్ణు విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే అదింకా మరిచిపోక ముందే మళ్లీ ఆమెతో అలాగే ప్రవర్తించాడు. దీంతో విష్ణును మళ్లీ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…