Manchu Manoj : డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయుడు, యంగ్ హీరో మనోజ్ గురించి పరిచయం అక్కర్లేదు. భార్యకు విడాకులు ఇచ్చినప్పటి నుంచి మనోజ్ రెండో పెళ్లిపై నెట్టింట పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. మంచు మనోజ్‌కు ఇదివరకే హైదరాబాద్‌కు చెందిన ప్రణతి రెడ్డితో వివాహం జరిగింది. 2015లో వీరి వివాహం కాగా.. ఈ జంట 2019లో విడిపోయారు. అప్పటి నుంచి మనోజ్ సింగిల్‌గానే ఉంటున్నాడు. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి.. అహం బ్రహ్మస్మి సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
అయితే తాజాగా భూమా నాగిరెడ్డి రెండవ కూతురు భూమా మౌనిక రెడ్డిని రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు హింట్ ఇచ్చాడు. వారిద్దరు ఇటీవల వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దీంతో భూమా మౌనికా రెడ్డి, మంచు మనోజ్‌లు పెళ్ళి చేసుకుబోతున్నట్టు వస్తున్న వార్తలకు బలం చేకూరింది. దీంతో విడాకుల తరువాత మనోజ్ రెండో పెళ్లికి రెడీ అవ్వగా మొదటి భార్య ప్రణతి రెడ్డి ఎలా ఉంది ? ప్రస్తుతం ఏం చేస్తుంది.. అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.

విడాకుల తరువాత ప్రణతి రెడ్డి అమెరికాకు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ప్రణతి ఇల్లస్ట్రేషన్ ఆర్టిస్ట్ కాగా అమెరికాలో సింగిల్ గానే ఉంటున్నట్టు సమాచారం. ఇక ప్రణతి రెడ్డి, మనోజ్ లు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రణతి రెడ్డి.. మనోజ్ వదిన విరోనికకు దగ్గరి బంధువు మరియు స్నేహితురాలు కూడా. పెద్దలను ఒప్పించి మనోజ్, ప్రణతి పెళ్లి చేసుకోగా మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఇదిలా ఉండగా మనోజ్, భూమా మౌనికారెడ్డిల వివాహం ఎప్పుడనేది సందర్భమొచ్చినప్పుడు తామే చెబుతామని మనోజ్ మీడియాకు తెలిపారు.