Manchu Lakshmi : మంచు లక్ష్మి అంటేనే మనకు సహజంగానే ఆమె మాట్లాడే భాష.. యాస గుర్తుకు వస్తాయి. ఆమె మాట్లాడే మాటలు నవ్వు తెప్పిస్తుంటాయి. అయినప్పటికీ ఆమె ఆ విధంగానే మాట్లాడుతుంది తప్ప వెనక్కి తగ్గదు. ఇక ఇప్పటికే ఆమె అనేక సినిమాల్లో పలు భిన్న పాత్రల్లో నటించింది. కానీ దురదృష్టవశాత్తూ ఆమె నటించిన సినిమాలు ఒక్కటి కూడా హిట్ కాలేదు. కానీ నటనలో తనకంటూ ఓ గుర్తింపును మాత్రం తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈమె ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.

మంచు లక్ష్మి ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ మధ్యే కలరి పట్టు అనే కేరళ విద్యను నేర్చుకుంటూ దాని ఫొటోలను కూడా షేర్ చేసింది. ఇక తాజాగా ఈమె మరోమారు ఓ భిన్న క్యారెక్టర్‌లో ఉన్న ఫొటోను షేర్ చేసింది. ఇందులో మంచు లక్ష్మి విచిత్ర వేషధారణలో ఉండడం విశేషం. దీంతో ఆమెను చూసిన వారందరూ ఆమెకు ఏమైంది.. అని ఆరాలు తీయడం మొదలు పెట్టారు.
ప్రపంచ థియేటర్ డే సందర్భంగా మంచు లక్ష్మి ఓ నాటకంలో పాల్గొంది. అందులో వేసిన వేషం తాలూకు ఫొటోనే అది. దీంతో ఈ ఫొటో వైరల్‌గా మారింది. అయితే ఈ విషయం తెలియని చాలా మంది నిజంగానే ఆమెకు ఏదో జరిగిందని ఖంగారు పడుతున్నారు. ఇక మంచు లక్ష్మి ప్రస్తుతం సినిమాలతోనూ బిజీగా ఉంది. మళయాళ స్టార్ నటుడు మోహన్‌లాల్‌తో కలిసి ఈమె ఓ సినిమాలో నటిస్తోంది. అలాగే మరో తమిళ మూవీలో పోలీస్ పాత్రలో కనిపించనుంది.