Manchu Lakshmi : మోహన్ బాబు నట వారసురాలు మంచు లక్ష్మీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్వీట్స్ చేస్తూ వార్తలలో నిలుస్తూ ఉంటుంది. ఇటీవల చేతి వేళ్లు, మోకాలికి తగిలిన దెబ్బలతో అల్లాడిపోతున్నట్టుగా ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో అభిమానులు అసలు మంచు లక్ష్మికి ఏమైందంటూ ఆరా తీయడం ప్రారంభించారు. అయితే ఫ్యాన్స్ నుంచి వరుసగా మెసేజ్‌లు వస్తుండటంతో జరిగిన విషయాన్ని వివరించింది మంచు లక్ష్మీ.
అవి రియల్ ఫొటోలు కాదు, రీల్ పిక్స్ అని షేర్ చెప్పి నెటిజన్స్ ఆగ్రహానికి గురైంది. ఇక తాజాగా తన సోషల్ మీడియాలో మరో ఆసక్తికర ట్వీట్ చేసింది. ఇన్ని రోజులు ఫ్యామిలీతో కలిసి ఉన్నాను.. ఇకపై నా కోసం కొంత సమయం కేటాయించుకునేందుకు వెళ్తున్నాను అంటూ చెప్పేసింది. కానీ ఎక్కడికి వెళ్తుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
https://twitter.com/LakshmiManchu/status/1475033218571124736?s=20
ఎయిర్ పోర్ట్ లాంజ్‌లో ఎదురుచూసిన మంచు లక్ష్మీ.. ఆకలి వేయకపోయినా కూడా అక్కడ తినేసిందట. ఎందుకంటే ఆ ఫ్లైట్ టికెట్ కొనేందుకు తన కిడ్నీలు అమ్ముకునేంత పరిస్థితి వచ్చిందట. అందుకే ఆ టికెట్ డబ్బులకు న్యాయం చేసేందుకు అలా ఆకలి కాకపోయినా కూడా తింటున్నానని చెప్పుకొచ్చింది. మంచు లక్ష్మీ చేసిన ఆ ట్వీట్‌కు జనాలు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.