Manchu Lakshmi : కొద్ది రోజులుగా ఎంతో ఉత్కంఠగా కొనసాగిన మా ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రకాష్ రాజ్‌పై భారీ మెజారిటీతో విష్ణు విజయం సాధించారు. అయితే ముందు నుంచీ చాలా మంది మంచు విష్ణునే ప్రెసిడెంట్ అవుతాడని చెప్పారు. అలా చెప్పినట్లుగానే జరిగింది. ఇక ఆయన విజయంపై సెలబ్రిటీలు తమదైన శైలిలో స్పందిస్తూ.. శుభాకాంక్షలు చెబుతున్నారు.
మంచు విష్ణు విజయంపై ఆయన సోదరి మంచు లక్ష్మి స్పందించారు. నా తమ్ముడా మజాకా.. అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. నిజానికి మంచు విష్ణు పోటీలో నిలబడ్డాక మంచు లక్ష్మి కూడా తన వంతుగా క్యాంపెయినింగ్ చేశారు. ఇక మంచు విష్ణు గెలిచాక ఆమె పట్టరానంత సంతోషంలో ఉన్నట్లు తెలుస్తోంది.
Na thammuda mazaa kaaaa…. Here’s to his stupendous win my hero!!!!!! @iVishnuManchu
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) October 10, 2021
మరోవైపు ప్రకాష్ రాజ్ ఓటమిని జీర్ణించుకోలేని నాగబాబు మా మెంబర్‌షిప్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన అన్న మెగాస్టార్ చిరంజీవి ముందు రోజు రాత్రి అందరం కలసి కట్టుగా ఉందామని చెప్పినా కూడా.. ఇంకా నాగబాబు ఆ వ్యథ నుంచి బయటకు రానట్లు తెలుస్తోంది.