Manchu Lakshmi Dance : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసురాలిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మంచు లక్ష్మీ. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా టీవీ షోస్ మరియు కొన్ని అవార్డ్ ఫంక్షన్స్ లలో యాంకర్ గా కూడా అలరిస్తుంది మంచు లక్ష్మీ. అయితే సినిమాల ద్వారా పెద్దగా గుర్తింపు సాధించలేదు మంచు వారసురాలు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో అభిమానులతో అనేక విషయాలు పంచుకుంటుంది. అయితే మంచు లక్ష్మీ పెట్టిన అనేక పోస్ట్స్ వైరల్ అవుతూ ట్రోలింగ్ కి గురవుతుంటాయి.
మంచు ఫ్యామిలీ నుంచి ఎవరు పోస్ట్ చేసినా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు కానీ మంచు లక్ష్మీ ఎక్కువగా పోస్టులు చేయడం వల్ల ఎక్కువ ట్రోలింగ్ కి గురవుతుంది. అయితే ఆ మధ్య చీరకట్టులో మాస్ డాన్స్ వేస్తూ ఉర్రూతలూగించింది లక్ష్మీ. ఎవరూ చూడటం లేదని తెలిసినప్పుడు.. డాన్స్ చేస్తే పిచ్చ క్రేజ్ అంటూ ఆ వీడియోకి అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చింది. ఆ వీడియోలో ఆమె కూతురు విద్యా నిర్వాణ కూడా జతకలిసి మాస్ స్టెప్పులు వేసింది.

అయితే ఆ వీడియోలో మంచు లక్ష్మీ చీరకట్టులోనే ఉంది అసలు అందం అనేట్టుగా.. ఒంపుసొంపుల వయ్యారాలను వడ్డించింది. నాభి అందాలతో కనువిందు చేయడంతో కొంతమంది ఆహా ఓహో అని అంటుంటే.. మరికొంతమంది ఎప్పటిలాగే నెగెటివ్ కామెంట్లతో ట్రోల్స్ మొదలుపెట్టారు. రికార్డింగ్ డాన్స్ అని కొందరు.. ఆమె అంద చందాలను తెగ వర్ణిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మంచు లక్ష్మీ బెస్ట్ ఫ్రెండ్ రకుల్ ప్రీత్ సింగ్‌కి అయితే ఈ వీడియో నచ్చేయడంతో లైక్ చేసింది. ఆమెతో పాటు మరికొంత మంది సెలబ్రెటీలు మంచు లక్ష్మీ మాస్ డాన్స్‌కి ఫిదా అవుతున్నారు.