Manchu Lakshmi : రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే అటాక్, రన్‌వే 34 అనే సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం విదితమే. అయితే ఇవి హిందీ సినిమాలు. కానీ ఇవి వచ్చినట్లు కూడా చాలా మందికి తెలియదు. తెలుగులో ఈమెకు ఆఫర్లు తగ్గిపోవడంతో బాలీవుడ్ బాట పట్టింది. ప్రస్తుతం ఈమె చేతిలో అర డజను వరకు హిందీ సినిమాలు ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటిగా త్వరలోనే విడుదల కానున్నాయి. ఇక మంచు లక్ష్మి కూడా సినిమా షూటింగ్‌లలో బిజీగా ఉంది. అయితే ఈ ఇద్దరూ కలసి ఒక చోట చేరి ఇటీవల ఎంజాయ్ చేశారు. అందులో భాగంగానే వారు ఓ పాటకు డ్యాన్స్ చేశారు.
జుగ్ జగ్ జీయో అనే సినిమాలోని పంజాబీ పాటకు రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి ఇద్దరూ డ్యాన్స్ చేశారు. తమ స్టెప్పులతో అలరించారు. ఈ క్రమంలోనే ఈ వీడియోను రకుల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా.. అది వైరల్‌గా మారింది. కాగా రకుల్, మంచు లక్ష్మి ఇద్దరూ మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ అప్పుడప్పుడూ ఇలా కలుస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అందులో భాగంగానే తాజాగా వీరు మరోమారు ఎంజాయ్ చేశారు.
ఇక సినిమాల విషయానికి వస్తే రకుల్ ప్రీత్ సింగ్.. డాక్టర్ జి, థాంక్ గాడ్, అయలాన్, ఛత్రివాలి అనే మూవీల షూటింగ్‌లతో బిజీగా ఉంది. అలాగే మంచు లక్ష్మి లేచింది మహిళా లోకం అనే సినిమాలో నటిస్తోంది. దీంతోపాటు ఈమె మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. ఇవి కూడా త్వరలో విడుదల కానున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…