Manchu lakshmi : కలెక్షన్ కింగ్ వారసురాలిగా ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చింది మంచు లక్ష్మి. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా టీవీ షోలలో మరియు కొన్ని అవార్డ్ ఫంక్షన్స్ లో యాంకర్ గా కూడా అలరిస్తుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో అభిమానులతో అనేక విషయాలు పంచుకుంటుంది. నటిగా, నిర్మాతగానే కాకుండా హోస్ట్ గా కూడా తానేంటో చూపిస్తోంది. తాజాగా ఓటీటీలో కూడా తన హవా కొనసాగిస్తోంది. ఆహాలో కుకింగ్ షోతో మరోసారి మన ముందుకు వచ్చింది మంచు.
గతంతో ఆహా భోజనంబు అంటూ.. సీజన్ 1ను సక్సెస్ ఫుల్ గా రన్ చేసిన లక్ష్మీ. సీజన్ 2లో చెఫ్ మంత్రాతో ముస్తాబు అయ్యింది. ఈ షోలో అద్భుతంగా రెడీ అయిన లక్ష్మీ ఆ పిక్స్ ని రీసెంట్ గా తన ఇన్ స్టాలో షేర్ చేసింది. చెఫ్ మంత్రాలో ఈసారి కూడా సెలెబ్రిటీలు సందడి చేస్తున్నారు. పసందైన విందులతో పాటు.. కమ్మని మాటల విందు కూడా వండి వడ్డించబోతున్నారు. అంతేకాదు ఈ షోలో మంచుతో పాటు వచ్చిన సెలబ్రిటీలతో వివిధ వంటకాల్ని వండించబోతున్నారు. హోస్ట్ గా న్యూ లుక్ లో మంచు లక్ష్మి మెరిసిపోతోంది.

ఏజ్ పెరుగుతున్నా కొద్ది ఇంకాస్త నాజూగ్గా తయారవుతోంది. ఈ మధ్య సినిమాలు మానేసి ఎక్కువగా బుల్లి తెరపైనే సందడి చేస్తోంది ఈ బ్యూటీ. అంతేకాదు సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా స్టార్ట్ చేసింది మంచు లక్ష్మీ. తన పర్సనల్ విషయాలతో పాటు.. హోమ్ టూర్లతో హడావిడి చేస్తోంది. చెఫ్ మంత్రా సీజన్ 2 ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రసారం అవుతుంది. సీజన్ 2లో 8 ఎపిసోడ్స్ ప్రసారం కానున్నాయి. ఈసారి సీజన్ 2 కోసం డిఫరెంట్ లుక్స్ ను ట్రై చేస్తోంది మంచు లక్ష్మీ. మరి సీజన్ 2కి ఏ రేంజ్ లో రేటింగ్స్ తెచ్చిపెడుతుందో చూడాలి.