Manchu Lakshmi : మంచు ఫ్యామిలీ వారసురాలిగా తెలుగు తెరకు పరిచయం అయిన మంచు లక్ష్మి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తన సినిమాల కన్నా తన ఇంగ్లిష్ యాసతోనే ప్రేక్షకులకు ఎంతో దగ్గరైందని చెప్పవచ్చు. ఇక ఒక్కో సందర్భంలో ఆమె తనదైన శైలిలో మాట్లాడే మాటలు వైరల్ అవుతుంటాయి. అందులో భాగంగానే ఇప్పటి వరకు ఆమె పలు సందర్భాల్లో మాట్లాడిన విషయాలపై ఇప్పటికీ ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. ఇక ఈ మధ్య కాలంలో మంచు ఫ్యామిలీపై ట్రోల్స్ మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోమారు మంచు లక్ష్మిని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అందుకు కారణం కూడా ఉంది. అదేమిటంటే..
మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం విదితమే. అయితే తాజాగా ఆమె హైదరాబాద్ శివారు ప్రాంతమైన శామీర్‌పేటలో తినేందుకు అనువుగా ఉండే మంచి దాబా పేరు చెప్పండి.. హెల్ప్.. అంటూ ట్వీట్ చేసి నెటిజన్లను సహాయం అడిగింది. అయితే కొందరు తమకు తెలిసిన పేర్లు చెప్పారు. కానీ కొందరు మాత్రం ఆమెను టార్గెట్ చేశారు. ముఖ్యంగా గతంలో ఆమె మాట్లాడిన పలు మాటలను ఆమెకే రీట్వీట్ చేశారు.

ఒకసారి మంచు లక్ష్మి ఏదో సందర్భంలో మాట్లాడుతూ.. నిలదీసిఫై అనే పదం వాడింది. అసలు తెలుగులో కాదు కదా.. ఇలాంటి పదం దాదాపుగా ఏ భాషలోనూ ఉండదు. దీంతో ఆమెను అప్పట్లో ఒక ఆట ఆడుకున్నారు. ఈ పదంపై ఇప్పటికీ జోకులు పేలుస్తూనే ఉన్నారు. అయితే మంచు లక్ష్మి దాబా గురించి చెప్పమని అడిగితే.. నెటిజన్లు మాత్రం నిలదీసిఫై అనే డైలాగ్ వాటి ఆమెపై సెటైర్ వేస్తున్నారు. అది దాబా కాదు.. దా.. బా.. అని అనాలి. దాన్ని సాగదీయాలి.. సాగదీసిఫై.. అంటూ ఆమెకు ట్వీట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంచు లక్ష్మి ట్వీట్ వైరల్‌గా మారింది.
కాగా మంచు లక్ష్మి ప్రస్తుతం తెలుగులోనే కాక పలు ఇతర భాషలకు చెందిన చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. ఓ మళయాళం మూవీలో నటించేందుకు ఆమె ఏకంగా అక్కడి సంప్రదాయ విద్య అయిన కలరి పట్టును కూడా నేర్చుకుంటోంది. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె గతంలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే అప్పట్లో ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి.
It's not "dhaba" It's dhaaaaaaa…… Baaaaa… "A" should be sagadeesify
— CineCorn (@cine_corn) May 18, 2022