Suhani : మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్ సుహాని.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

Suhani : 2000వ‌ సంవత్సరంలో చిత్రం సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చాడు ఉదయ్ కిరణ్. నువ్వు నేను, మనసంతానువ్వే చిత్రాలతో బ్లాక్ బాస్టర్ హిట్స్ ను అందుకుని యువతలో లవర్ బాయ్ గా పేరు సంపాదించుకున్నాడు. 2001లో ఉదయ్ కిర‌ణ్, రీమాసేన్ జంట‌గా న‌టించిన మ‌న‌సంతా నువ్వే సినిమా అప్పట్లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. ఉద‌య్ కిర‌ణ్ కెరీర్ లో మూడువ సినిమాగా తెర‌కెక్కిన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో ఆ త‌రువాత వ‌రుస సినిమా అవ‌కాశాలు అందుకున్నాడు.

మనసంతా నువ్వే సినిమాలో క‌థ ప‌రంగా ఉద‌య్ కిర‌ణ్ రీమాసేన్ చిన్న‌త‌నం నుంచి ప్రేమించుకుంటారు. ఆ త‌రువాత కొన్ని కారణాల వలన విడిపోతారు. ఉదయ్ కిరణ్ మరియు రీమా సేన్ చిన్ననాటి పాత్రలలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ లు కూడా అద్భుతంగా నటించి అందరినీ ఆకట్టుకున్నారు. చాలా మంది ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా కేవలం ఒకటి రెండు సినిమాలే చేసినా మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. అలా తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే చైల్డ్ ఆర్టిస్టులలో సుహాని కూడా ఒకర‌ని చెప్పచ్చు.

Suhani

సుహాని మనసంతా నువ్వే సినిమాలో రీమాసేన్ చిన్ననాటి పాత్రలో నటించడం జరిగింది. తూనీగా తూనీగా అనే పాటలో సుహాని క్యూట్ ఎక్సప్రెషన్స్ ప్రేక్షకులకు ఇప్పటికీ కూడా బాగా గుర్తుండే ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాల రామాయణం సినిమాతో వెండితెరకు పరిచయమైంది సుహాని. ప్రేమంటే ఇదేరా, గణేష్‌, మనసంతా నువ్వే, ఎలా చెప్పను వంటి పలు చిత్రాల్లో బాలనటిగా నటించి ప్రేక్షకులను అలరించింది.

20 ఏళ్లు దాటిన త‌రువాత సుహానీ హీరోయిన్ గా కూడా త‌న అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి 2008 లో స‌వాల్ సినిమాలో హీరోయిన్ గా తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా ఆశించిన మేరకు విజ‌యం సాధించలేకపోయింది. ఆ త‌వ‌రాత సుహానీ స్నేహ‌గీతం సినిమాలో న‌టించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద  బోల్తా కొట్టింది. సుహాని నటించిన చిత్రాలు సక్సెస్ కాకపోవడంతో వెండి తెరకు దూరం అయింది. తాజాగా సుహాని ప్రముఖ సంగీతకారుడు, మోటివేషనల్‌ స్పీకర్‌ విభర్‌ హసీజా ని పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM