కుక్కలు, పిల్లలు, పక్షలు, ఆవులు, గేదెలు.. లాంటి వాటిని పెంచుకుంటే ఫర్లేదు. వాటితో మనకు ఎలాంటి హాని ఉండదు. ఇవి ఎక్కడ తారస పడ్డా కూడా మనకు వీటితో ముప్పు ఉండదు. కానీ క్రూర మృగాలు అలా కాదు. వాటికి వీలైనంత దూరంగా ఉండాల్సిందే. సింహం, చిరుత, పులి లాంటి జంతువులను చూడాలని కోరుకోవాలి. కానీ వాటి దగ్గరకు మాత్రం వెళ్లకూడదు. మనం చిన్నతనం నుంచి ఈ విషయాలను నేర్చుకుంటూనే ఉన్నాం. కానీ కొందరు ఈ విషయాలు తెలిసినా క్రూర మృగాలతో ఆటలు ఆడుతున్నారు. ఫలితంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?
ఓ జూలో పులి బోనులో ఉండగా.. దాన్ని కొందరు చూస్తున్నారు. అయితే కుక్కను దగ్గరకు పిలిచి దాని తలపై నిమిరినట్లు.. పులితో కూడా అలాగే చేద్దామని అనుకున్నాడు ఓ వ్యక్తి. దీంతో బోను దగ్గరగా వచ్చి అందులో ఉన్న పులిని పిలిచాడు. అది వచ్చినట్లే వచ్చి అతని చేతిలో ఉన్న పదార్థాన్ని తినేసింది. అంతేకాదు.. వెంటనే అతని చేతిని కూడా అందిపుచ్చుకుని కరకరా నమిలి మింగేసింది. దీంతో ఆ ప్రదేశం అంతా రక్తసిక్తమైంది. ఈ క్రమంలోనే ఈ మొత్తం సంఘటనను కొందరు వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. దీంతో చాలా మంది ఆ వీడియోపై స్పందిస్తున్నారు.
పులి అంటే క్రూర మృగం. దాంతో ఆటలా. కుక్కలాగే దాన్ని కూడా పెంపుడు జంతువులా భావించాడు.. చివరకు ఏమైందో చూడండి.. అలాంటి జంతువులు దగ్గరగా ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వాటిని దగ్గరకు పిలిచి ఫుడ్ పెట్టడం ఏంటి. దయచేసి ఇలా ఎవరూ చేయొద్దు.. అంటూ నెటిజన్లు ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు.
అయితే ఈ వీడియో ఎక్కడిది.. దీన్ని ఎవరు తీశారు.. అసలు ఈ సంఘటన ఎక్కడ జరిగింది.. అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. కానీ దీన్ని చూసిన వారందరూ తీవ్రంగా షాక్‌కు గురవుతున్నారు. ఇలాంటి వీడియోను గుండె ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడాలని అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…