Viral Video : బస్సుల్లో లేదా రైళ్లలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు సహజంగానే హాయిగా అనిపిస్తుంది. దీంతో నిద్ర బాగా వస్తుంటుంది. ఈ క్రమంలోనే ప్రయాణాలు చేసే సమయంలో చాలా మంది సీట్లలోనే కునుకు తీస్తుంటారు. అయితే అంతా బాగానే ఉంది కానీ.. ఆ సమయంలోనూ జాగ్రత్త అవసరమే. మరీ అతిగా నిద్రించరాదు. చిన్నపాటి కునుకు అయితే ఫర్వాలేదు. కానీ గాఢ నిద్ర పోతే మాత్రం.. ఏదైనా జరగవచ్చు. ఓ వ్యక్తికి కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అతను రైలులో నిద్రిస్తూ.. గాఢ నిద్రలోకి జారుకున్నాడు. తరువాత ఏం జరిగిందంటే..
ఓ లోకల్ ట్రెయిన్‌లో ఓ వ్యక్తి సీట్‌లో కూర్చుని గాఢంగా నిద్రించాడు. చుట్టూ ఉన్న పరిసరాలను.. తాను ట్రెయిన్‌లో ప్రయాణిస్తున్న విషయాన్ని కూడా అతను మరిచిపోయాడు. ఆదమరిచి నిద్రించాడు. దీంతో సీట్‌లో కూర్చున్నవాడు కూర్చున్నట్లే పక్కకు ఒరిగాడు. అయితే అది మంచం కాదుగా.. సీట్.. దీంతో వెంటనే కింద పడిపోయాడు. ఈ క్రమంలో చుట్టూ ఉన్నవారు.. చూసుకోవాలి కదా.. అన్న ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆ సమయంలో తీసిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. దాన్ని నెటిజన్లు చూస్తూ తెగ నవ్వుకుంటున్నారు. ఆ వ్యక్తిపై రకరకాల కామెంట్లు కూడా పెడుతున్నారు.

సాధారణంగా మనకు ప్రయాణాల్లో నిద్ర వస్తుంటుంది. కానీ నిద్ర వస్తుంది కదా.. అని చెప్పి అతిగా నిద్రించకూడదు. నిద్రిస్తే ఇదిగో ఇలాగే జరుగుతుంది. మనం ప్రయాణాలు చేసే సమయంలో మన చుట్టూ ఉన్న పరిసరాలు, వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలా నిద్రిస్తే ఎలా.. అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.
View this post on Instagram