Viral Video : గారెలు, వడలు, పకోడీలు.. ఇలాంటి చిరుతిళ్లను సహజంగానే ఎవరైనా సరే ఇష్టంగా తింటుంటారు. వేడి వేడిగా వీటిని వండుకుని తింటే వచ్చే మజాయే వేరు. చల్లని వాతావరణంలో వీటిని తింటే రుచి అదిరిపోతుంది. అయితే వీటిని వేయించేందుకు మనం వివిధ రకాల నూనెలను వాడుతుంటారు. ఎవరి ఇష్టానికి అనుగుణంగా నూనెలను ఉపయోగిస్తుంటారు. ఇక నూనెలో వీటిని కాల్చేటప్పుడు మనం గరిటెను ఉపయోగిస్తాం. గరిటెతోనే వాటిని రెండు వైపులా తిప్పుకుని కాల్చుతాం. అయితే ఆ వ్యక్తి మాత్రం గరిటెను వాడడం లేదు. చేతినే ఉపయోగిస్తున్నాడు. సలసలా కాగే నూనెలో చేయి పెట్టి వడలను వేయిస్తున్నాడు. చూస్తేనే షాక్‌కు గురవుతారు.
వడలు, గారెలు వంటి నూనె పదార్థాలను మనం నూనెలో బాగా వేయిస్తాం. అందుకు గరిటెను ఉపయోగిస్తాం. కానీ ఆ వ్యక్తి మాత్రం తన చేతినే గరిటెలా వాడుతున్నాడు. నూనెలో వేగుతున్న వడలను చేత్తోనే అటు, ఇటు తిప్పుతున్నాడు. ఇక అవి కాలిన తరువాత వాటిని చేత్తోనే బయటకు తీస్తున్నాడు. ఈ క్రమంలోనే అతను అలా వడలను తయారు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్‌గా మారింది.

చాలా మంది ఈ వీడియోపై కామెంట్స్ చేస్తున్నారు. మరుగుతున్న నూనెలో చేతిని అలా ఎలా పెడుతున్నాడు.. అనే విషయం అర్థం కాక నెటిజన్లు షాకవుతున్నారు. అసలు అలా సాధ్యమవుతుందా.. అని సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక అతని టాలెంట్ చూసి అతన్ని మెచ్చుకుంటున్నారు. కాగా ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ఎంతో మందిని ఆకట్టుకుంటోంది.