iPhone : ఆన్ లైన్ లో ఫోన్లను ఆర్డర్ చేస్తే సబ్బు బిళ్లలు, ఇటుకలు వచ్చిన సంఘటనలను మనం గతంలో ఎన్నో చూశాం. అయితే అలాంటి మోసాలను ఎక్కువగా డెలివరీ బాయ్స్ చేసేవారు. కనుక వాటికి చెక్ పెట్టేలా ఈ-కామర్స్ సంస్థలు పకడ్బందీగా చర్యలను తీసుకుంటున్నాయి. ఇక ఇటీవలి కాలంలోనే ఓ కొత్త సదుపాయాన్ని ఈ-కామర్స్ సంస్థలు వినియోగదారులకు అందిస్తున్నాయి. దాంతో డెలివరీ అయ్యే సమయంలోనే బాక్స్‌ను వినియోగదారులు డెలివరీ బాయ్ సమక్షంలోనే ఓపెన్ చేసి చూడవచ్చు.
అలా ఓపెన్ చేశాక వస్తువు ఉంటే ఓకే.. లేదంటే దాన్ని అలాగే అప్పటికప్పుడే రిటర్న్ పంపి రీఫండ్ పొందవచ్చు. నిజానికి ఇది ఎంతో మంచి సదుపాయం. కానీ ఇలా ఉన్నప్పటికీ తాజాగా ఓ వ్యక్తికి ఐఫోన్ ఆర్డర్ చేస్తే సబ్బు బిళ్ల వచ్చింది. వివరాల్లోకి వెళితే..
కేరళలోని కొచ్చి పట్టణానికి చెందిన నూరుల్ అమీన్ ఇటీవల అమెజాన్ లో ఐఫోన్-12 బుక్ చేశాడు. రూ. 70,900 ముందుగానే చెల్లించాడు. అమెజాన్ పే ద్వారా చెల్లింపు చేశాడు. ఈ క్రమంలో అమెజాన్ డెలివరీ బాయ్ ఫోన్ ను ఇవ్వగా.. దాన్ని నూరుల్ ఓపెన్ చేసి చూశాడు. అందులో విమ్ బార్ ఉంది. దీంతో షాకైన నూరుల్ వెంటనే దాన్ని అలాగే ఆ డెలివరీ బాయ్‌తో తిప్పి పంపేశాడు.
అయితే ఐఫోన్ 12 ఫోన్లు తమ వద్ద స్టాక్ లేనందున అతను చెల్లించిన మొత్తాన్ని అమెజాన్ రీఫండ్ చేసింది. ఈ క్రమంలో అసలు పొరపాటు ఎక్కడ జరిగిందో విచారించే సరికి.. షాక్ లాంటి నిజం బయట పడింది. ఆ ఫోన్‌కు చెందిన ఐఎంఈఐ ద్వారా ట్రేస్ చేయగా.. దాన్ని జార్ఖండ్‌లో ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది. అయితే నిజానికి ఆఫోన్ సెప్టెంబర్ నుంచే వినియోగంలో ఉంది. కానీ దాన్ని అక్టోబర్‌లో అమ్మకానికి పెట్టారు. అంటే.. ఉద్దేశపూర్వకంగానే ఎవరో వాడుతున్న ఫోన్‌ను అమ్మకానికి పెట్టారు. కానీ ఫోన్‌ను అందులో ఉంచకుండా.. విమ్ బార్ పెట్టారు. దీంతో ఆ బాక్స్ అలాగే డెలివరీ అయింది. అంటే.. ఇది డెలివరీ బాయ్ తప్పిదం కాదని, అమ్మకం దారు తప్పిదమేనని స్పష్టంగా తెలుస్తోంది. మరి ఈ తరహా మోసాలకు ఈ-కామర్స్ సంస్థలు ఎలా చెక్ పెడతాయో చూడాలి.
ఏది ఏమైనా.. మీరు కూడా ఆన్‌లైన్‌లో ఫోన్‌కు ఆర్డర్ పెడితే.. డెలివరీ బాయ్ ఎదుటే బాక్స్ ఓపెన్ చేసేలా సదుపాయాన్ని ఎంచుకోండి. లేదంటే ఇబ్బందులు ఏర్పడితే ఇచ్చిన సొమ్ము మొత్తం వెనక్కి వచ్చేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…