Prabhas : ప్ర‌భాస్‌కు సంబంధించి ఎవ‌రికీ తెలియ‌ని సీక్రెట్స్ ఇవే..!

Prabhas : బాహుబ‌లి రెండు పార్ట్‌లు, త‌రువాత సాహో మూవీకి చాలా స‌మ‌యం తీసుకున్న ప్ర‌భాస్‌.. ఇప్పుడు స్పీడు పెంచాడు. వ‌రుస‌గా ప్రాజెక్టుల‌కు ఓకే చెబుతున్నాడు. ఈ క్ర‌మంలోనే ప్ర‌భాస్ సినిమాలు రానున్న రోజుల్లో బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇక ప్ర‌భాస్ జీవితానికి చెందిన కొన్ని ఎవ‌రికీ తెలియని సీక్రెట్స్‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ప్ర‌భాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. అయితే ప్ర‌భాస్ తొలి హిందీ మూవీ బాహుబ‌లినే అనుకుంటారు. కానీ కాదు.. అంత‌క‌న్నా ముందే యాక్షన్ జాక్సన్ అనే సినిమాలో ప్ర‌భాస్ గెస్ట్ రోల్‌లో నటించాడు. ఇక ప్ర‌భాస్ కు అస‌లు హీరో అవ్వాల‌నే ఉద్దేశ‌మే లేద‌ట‌. బిజినెస్ చేసుకుందామ‌ని అనుకున్నాడ‌ట‌. కానీ అనుకోకుండా హీరో అయ్యాడు. త‌రువాత వెన‌క్కి తిరిగి చూసుకోలేదు.

ప్ర‌భాస్‌కు ర‌క‌ర‌కాల భోజ‌నాలు అంటే ఇష్టం. మ‌రీ ముఖ్యంగా.. బిర్యానీ అంటే ఎంతో ఇష్టం. చికెన్‌, మ‌ట‌న్‌, ప్రాన్స్‌.. ఇలా భిన్న ర‌కాల బిర్యానీల‌ను తింటాడు. బాహుబ‌లి మూవీ సంద‌ర్బంగా రోజుల త‌ర‌బ‌డి డైట్ పాటిస్తూనే మ‌ధ్య‌లో చీట్ డే పేరిట ఒక రోజంతా త‌న‌కు ఇష్ట‌మైన బిర్యానీల‌ను తిని గ‌డిపాడు. అలా ఒక రోజైతే ఏకంగా 15 ర‌కాల బిర్యానీల‌ను తిన్నాడ‌ట‌.

ప్ర‌భాస్ అంత ఫిట్‌గా ఉండేందుకు కార‌ణం.. ల‌క్ష్మణ్ రెడ్డి అనే ట్రెయిన‌ర్‌. ఈయ‌న 2010లో లాస్ వెగాస్ లో జరిగిన మిస్టర్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచాడు. కాగా ఈయ‌న‌కు ప్ర‌భాస్ ఇటీవ‌ల అత్యంత‌ ఖరీదైన రేంజ్ రోవర్ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. ప్ర‌భాస్ త‌న‌కు ఎవ‌రైనా ఇష్టం అయితే వాళ్ల‌ను డార్లింగ్ అని పిలుస్తాడు. ఫ్యాన్స్ ను కూడా అలాగే పిలుస్తాడు. ఇక ల‌క్ష్మ‌ణ్ కూడా అలాగే పిలుచుకుంటాడు.

ప్ర‌ముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ విజేత రాబర్ట్ డెనిరో అంటే ప్రభాస్ కు ఎంతో ఇష్టం. బాలీవుడ్ లో రాజ్ కుమార్ హిరాణీ సినిమాలు చూస్తాడు. తన ఇంటికి ఎవరొచ్చినా కడుపునిండా భోజనం పెట్టి పంపిస్తాడు. మ‌ర్యాద‌ల‌కు ఎలాంటి లోటు రానివ్వ‌డు. ప్రభాస్ తో నటించిన హీరోయిన్లంతా అతడి ఆత్మీయత, ఆతిథ్యానికి ముచ్చ‌ట ప‌డుతుంటారు. రకరకాల వంటల్ని ప్రత్యేకంగా తయారుచేయించి మ‌రీ హీరోయిన్లకు ప్ర‌భాస్ తానే స్వయంగా ద‌గ్గ‌రుండి మ‌రీ వ‌డ్డిస్తుంటాడు. ఇలా ప్ర‌భాస్ అంద‌రినీ త‌న సొంత వాళ్ల‌లా చూస్తాడు. అందుకనే ఇండ‌స్ట్రీలో అంద‌రికీ ప్ర‌భాస్ అంటే ఎంతో ఇష్టం.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM