అగ్నిసాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన భార్యాభర్తల బంధంలో భార్యాభర్తలు జీవితాంతం ఎంతో అన్యోన్యంగా ఉండాలని భావిస్తారు. అయితే కట్టుకున్న భార్యను దారుణంగా కడతేర్చి.. ఆమె గుండెపోటుతో మరణించిందని.. అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తూ ఆ భర్త అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
సూర్యాపేట జిల్లా నాగారం మండలం పస్తాలకు చెందిన చిత్తలూరు శ్రీనివాస్, సురాంభ దంపతులు. 18 సంవత్సరాల క్రితం రామంతపూర్ వలసవచ్చి ఇద్దరూ కూరగాయల వ్యాపారం చేసుకొనేవారు. ఈ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి శ్రీనివాస్ ఏ విధమైన పనులు చేయకుండా ఖాళీగా ఉండటమే కాకుండా అవసరం కోసం ఇతరుల దగ్గర డబ్బులు తీసుకుని అప్పులు చేసేవాడు. ఈ క్రమంలోనే అప్పు ఇచ్చిన వారు ఇంటి పైకి రావడంతో భార్యాభర్తల మధ్య గొడవ చోటుచేసుకుంది.
ఇలా తరచూ వీరిద్దరూ గొడవపడటంతో భార్యపై ఎంతో కక్ష పెట్టుకున్న శ్రీనివాస్ ఒక రోజు పిల్లలు నిద్రపోతున్న సమయం చూసి తన భార్యను కొట్టాడు. అప్పటికి తన భార్య కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతుంటే తన గొంతు నులిమి చంపాడు. ఎవరికీ తెలియకుండా శవాన్ని దహనం చేయాలని అర్ధరాత్రి సమయంలో టాటా ఏస్ లో తన భార్య మృతదేహాన్ని తీసుకుని వెళ్తుండగా తనకు కొడుకు, కూతురు ఫోన్ చేయడంతో కూరగాయల కోసం వెళ్తున్నామని అబద్ధం చెప్పాడు.
అయితే తనని దహనం చేయాలని భావించే సమయానికి తెల్లవారు కావడంతో తన ప్లాన్ రివర్స్ అయ్యింది. ఈ క్రమంలోనే కూరగాయల కోసం అతను వెళ్లగా తన భార్యకు గుండెపోటు వచ్చిందని.. దాంతో తను మరణించిందని నాటకం ఆడాడు. అయితే ఆమె శరీరంపై ఉన్న గాయాలు చూసి తమ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు గుట్టు బయట పడింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…