Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు సమంత పోస్ట్ చేసిన అనంతరం ఆమెను చాలా మంది పెద్ద ఎత్తున విమర్శించారు. అయితే సమంత అభిమానులు మాత్రం ఆమెకు సపోర్ట్‌గా నిలిచారు. ఇక ఆ పోస్ట్‌కు కామెంట్లను ఆఫ్ చేసింది. తరువాత పెట్టిన కొన్ని పోస్టులకు కూడా కామెంట్స్‌ను ఆన్ చేయలేదు. దీంతో ఆమె ఈ విడాకుల విషయంపై కొంత ఆందోళనకు గురై, భయపడినట్లు తెలుస్తోంది.
అయితే తాజాగా ఆమె కామెంట్స్ సెక్షన్‌ను మళ్లీ తన పోస్ట్‌లకు ఆన్ చేసింది. దీంతో కొంత వరకు హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. అక్కినేని కుటుంబానికి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలో సమంత విడాకులు ఇచ్చిందని తెలిసిన ఫ్యాన్స్ సమంతపై మండిపడ్డారు. ఇక కొన్ని సైట్లు, యూట్యూబ్ చానల్స్ అయితే పెద్ద ఎత్తున ఏవేవో వార్తలను ప్రచురించాయి. మరోవైపు సమంతపై వస్తున్న విమర్శలు కూడా ఎక్కువవయ్యాయి. దీంతో అన్నింటికీ సమంత కొంత భయపడే కామెంట్ల సెక్షన్‌ను ఆఫ్ చేసినట్లు తెలిసింది.
కానీ ఆమె తాజాగా మళ్లీ కామెంట్స్ సెక్షన్‌ను ఆన్ చేయడంతో కొంత వరకు ఆమెలో ఆందోళన, భయం తగ్గినట్లు అర్థం అవుతోంది. అక్కినేని అభిమానులు కామెంట్స్‌లో ఏమేం పోస్ట్ చేస్తారోనన్న ఆందోళనతోనే ఆమె కొన్ని రోజుల పాటు కామెంట్స్ సెక్షన్‌ను ఆఫ్ చేసినట్లు అర్థం చేసుకోవచ్చు. అయితే సమంత డై హార్డ్ ఫ్యాన్స్.. ముఖ్యంగా మహిళలు మాత్రం సమంతకు మద్దతుగా నిలుస్తున్నారు.
సమంత కామెంట్స్ సెక్షన్ మళ్లీ ఆన్ చేయడంతో ఆమెకు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. నువ్వు మళ్లీ ఎప్పటిలాగే ఈ అలజడి నుంచి బయటకు రావాలని నీకు స్ట్రాంగ్ సపోర్ట్‌ను ఇస్తున్నాం.. అని కామెంట్లు పెడుతున్నారు. దీంతో సమంత హమ్మయ్య అని ఊపిరిపీల్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక కొన్ని రోజులు పోతే ఈ గొడవ అంతా సద్దుమణిగి మళ్లీ ఎప్పటిలాగే అవుతుంది. ఏది ఏమైనా.. ఇన్ని రోజుల పాటు సమంత పడ్డ ఆందోళనకు కొంత రిలీఫ్ వచ్చినట్లే అయింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…