కుమార్తెకు దెయ్యం పట్టిందని.. దాన్ని వదిలించాలని చెప్పి ఓ తండ్రి దారుణమైన ఘాతుకానికి పాల్పడ్డాడు. సమాజం సిగ్గుతో తలదించుకునేలా ప్రవర్తించాడు. తన సోదరుడితో కలిసి తన కుమార్తెను అత్యంత కఠినంగా హింసించి చివరకు మంటల్లో వేసి కాల్చేశారు. ఈ ఘటన గుజరాత్‌లో చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
సూరత్‌కు చెందిన భవేష్ అక్బరి అనే వ్యక్తి ఆరు నెలల కిందట అక్కడి గిర్ సోమనాథ్ జిల్లాలోని ధావా అనే గ్రామానికి వచ్చి అక్కడే నివాసం ఉండసాగాడు. అతనితో కలిసి అతని సోదరుడు దిలీప్ కూడా నివసించేవాడు. అయితే తన 14 ఏళ్ల కుమార్తెకు దెయ్యం పట్టిందని భావిస్తూ.. భవేష్ అక్కడికి సమీపంలోని చక్లిధర్ అనే ప్రాంతానికి సోదరుడితో కలిసి వెళ్లాడు. వెంట కుమార్తెను తీసుకెళ్లారు. అక్కడ వారు అత్యంత రాక్షసంగా ప్రవర్తించారు.
ఆ బాలికను వారు ముందుగా కట్టేసి దుస్తులకు నిప్పు పెట్టి కాల్చేశారు. తరువాత ఆమెను తీవ్రంగా హింసించారు. అనంతరం ఆమెను మంటల్లో వేసి కాల్చేశారు. అయితే నిందితులు ఆనవాళ్లు లభించకుండా చేశారు. దీని వల్ల ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే స్థానికులు చెప్పిన ప్రకారం భవేష్ ఎల్లప్పుడూ ఒంటరిగా ఏదో ఆలోచిస్తూ ఉంటాడని, ఏపని చేయడని వెల్లడైంది. ఈ క్రమంలోనే పోలీసులు నిందితులు ఇద్దరినీ అరెస్టు చేసి జైలుకు తరలించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…