Bolero : వాహనాలను కొనేవారు ఎవరైనా సరే క్యాష్ లేదా డిజిటల్ రూపంలో చెల్లింపులు చేస్తారు. ఒక వేళ ఫైనాన్స్ తీసుకున్నా సరే.. డౌన్ పేమెంట్‌ను కూడా క్యాష్ లేదా డిజిటల్ రూపంలో చెల్లిస్తారు. ఎక్కువ విలువ గల నోట్లను లేదా డిజిటల్ రూపంలో నగదును ఇచ్చి వాహనాలను కొనుగోలు చేస్తారు. కానీ ఆ వ్యక్తి మాత్రం ఏకంగా రూ.12 లక్షలను నాణేల రూపంలో ఇచ్చాడు. దీంతో ఆ నాణేలను లెక్క పెట్టేసరికి షోరూం సిబ్బందికి తలప్రాణం తోకకు వచ్చింది. ఎట్టకేలకు కౌంటింగ్ పూర్తి చేసిన షోరూం సిబ్బంది ఆ వ్యక్తికి కారును ఇచ్చేశారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి మహీంద్రా షోరూంకు వెళ్లి బొలెరో ధర ఎంత ఉందో ఎంక్వయిరీ చేశాడు. ఈ కారు మోడల్ బేసిక్ వేరియెంట్ ధర రూ.8.99 లక్షలకు ప్రారంభమవుతుంది. గరిష్టంగా దీని ధర రూ.12 లక్షలుగా ఉంది. అయితే అతను రూ.12 లక్షల వేరియెంట్‌ను కొన్నాడు. ఇక పేమెంట్ మొత్తాన్ని నాణేల రూపంలో చెల్లించాడు. దీంతో సిబ్బందికి లెక్క పెట్టడం కష్టమైంది. అయితే చివరకు వారు కౌంటింగ్ పూర్తి చేసి పేపర్ వర్క్ కానిచ్చి.. ఆపై ఆ వాహనాన్ని అతనికి డెలివరీ ఇచ్చేశారు. ఈ క్రమంలోనే ఈ వీడియో వైరల్‌గా మారింది.
కాగా బొలెరో వాహనం ప్రస్తుతం బీఎస్6 మోడల్‌లో లభిస్తోంది. ఇందులో 1.5 లీటర్ల త్రీ సిలిండర్ ఎం-హాక్ డీజిల్ ఇంజిన్ ను ఏర్పాటు చేశారు. ఇది గరిష్టంగా 75 హార్స్ పవర్‌ను అందిస్తుంది. ప్రస్తుతం బొలెరో వాహనం బి4, బి6, బి6 (ఓ) మోడల్స్‌లో లభిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…