Babu Gogineni : ప్రముఖ విశ్లేషకుడు, తత్వవేత్త, నాస్తికుడు బాబు గోగినేని ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల విడుదలవుతున్న సినిమాలపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఆర్ఆర్ఆర్ మూవీపై తన దైనశైలిలో రివ్యూ ఇచ్చారు. ఇంతకీ ఈ మూవీపై అసలు ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.
రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రశంసలు లభిస్తున్నాయి. ఇందులో నటించిన రామ్ చరణ్, ఎన్‌టీఆర్‌లను ఆకాశానికెత్తేస్తున్నారు. అయితే ప్రముఖ విమర్శకుడు బాబు గోగినేని మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమాను తీవ్రంగా విమర్శించారు. ఈ సినిమాను చాలా గ్రాండ్‌గా తీశారు కానీ.. ఇందులో కథ అసలు ఏమీ లేదని అన్నారు. ఒక మూవీని చరిత్రగా నిలపడం కోసం చాలా కష్టపడ్డారు కానీ.. వారి ప్రయత్నం ఫలించలేదన్నారు. హీరోలిద్దరి మధ్య సంబంధాలు పేలవంగా ఉన్నాయని, అసలు గుర్తుండి పోయే డైలాగ్ ఒక్కటి కూడా లేదని అన్నారు. ఇక కథ చాలా నాసిరకంగా ఉందని.. ఇందులో మహిళల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయిందని అన్నారు. కామెడీ లేదని, లాజిక్ అసలే లేదని, పాటలకు అర్థం పర్థం లేదని.. ఆర్ఆర్ఆర్ సినిమాపై బాబు గోగినేని తీవ్ర విమర్శలు చేశారు.
అయితే ఈ మూవీలో రక్తపాతం ఎక్కువగా ఉంది కనుక చిన్నపిల్లలకు ఈ సినిమాను అసలు చూపించవద్దని బాబు గోగినేని కోరారు. కాగా ఆయన విమర్శలపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నీ పని నువ్వు చేసుకో.. నీకు సినిమా తీయడం చేతకాదు.. ఇతరులు తీసే సినిమాలపై విమర్శలు చేయకు.. వీలుంటే సినిమాను తీసి చూపించు.. అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…