Sonu Sood : చ‌ల్ల‌ని బీర్ కావాల‌ని సోనూసూద్‌ను అడిగిన వ్య‌క్తి.. అందుకు ఆయ‌న స‌మాధానం అదుర్స్‌..!

Sonu Sood : వెండితెర‌పై విల‌నిజం ప్ర‌ద‌ర్శించిన సోనూసూద్ రియ‌ల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి రియ‌ల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. కోవిడ్ ప‌రిస్థితుల్లో సామాన్యుల‌కు, మ‌ధ్య త‌ర‌గ‌తి వారికి సేవ‌లు అందించి అండ‌గా నిలబ‌డి రియ‌ల్ హీరో అనిపించుకున్న వ్య‌క్తి సోనూసూద్‌. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులకు కూడా దేవుడుగా మారారు. ఆయన చారిటీ సాయంతో క్షేమంగా భారత్‌కు త‌ర‌లించారు. వారంతా సోషల్ మీడియా వేదికగా ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఇలా బాలీవుడ్ నటుడు సోనూసూద్ సేవలు ఉక్రెయిన్‌కు కూడా చేరుకున్నాయి.

Sonu Sood

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొక వైపు అడిగిన వారికి లేదు.. కాదు.. అన‌కుండా సహాయం చేస్తున్నారు సోనుసూద్. అయితే కొంద‌రు నెటిజ‌న్స్ ఆయ‌న‌తో చ‌మ‌త్కారాలు చేస్తుండ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంటుంది. తాజాగా ఓ నెటిజ‌న్ చలికాలంలో దుప్పట్లు పంచారు.. అదేవిధంగా వేసవి కాలంలో చల్లని బీరు కూడా పంపిణీ చేస్తే బాగుంటుంద‌న్నాడు. ఈ పోస్ట్ ని ఉద్దేశిస్తూ సోనూసూద్ బీర్ తోపాటుగా స్టఫ్ కూడా ఉంటే బాగుంటుంది.. అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. దీనిపై నెటిజ‌న్స్ ప‌లు రకాలుగా స్పందిస్తున్నారు.

ఇక కొద్ది రోజులుగా సోనూసూద్ పొలిటిక‌ల్ ఎంట్రీపై జోరుగా ప్ర‌చారాలు న‌డుస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆయ‌న స్పందించారు. స‌మాజ‌సేవ అనేది త‌మ ర‌క్తంలోనే ఉంద‌ని, త‌న త‌ల్లి ఒక ప్రొఫెస‌ర్ అని, పిల్ల‌ల‌కు త‌న జీవిత పాఠాల‌న్నీ నేర్పార‌ని అన్నారు. అదేవిధంగా త‌న తండ్రి ఒక సామాజిక కార్య‌క‌ర్త అని, మోగాలో చాలా పాఠశాలలు, కళాశాలలు, ధర్మశాలలను త‌న‌ కుటుంబం నిర్మించింద‌ని అన్నారు. ఇప్పుడు త‌న సోద‌రి కూడా త‌న తల్లిదండ్రుల అనుస‌రిస్తోందని, పంజాబ్‌లోని మోగా సిటీలో ఎన్నో సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నార‌ని సోనూసూద్ చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల్లోకి వస్తానని సోనూసూద్ ప్ర‌క‌టించారు. త‌న సామాజిక కార్య‌క్ర‌మాలను, ఎన్నికలు రెండింటినీ నిర్వహించడానికి త‌న‌కు తగినంత పెద్ద టీమ్ లేదని అన్నారు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM