Anasuya : బుల్లితెరకి గ్లామర్ అద్దిన హీరోయిన్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చేది అనసూయ పేరు. అనసూయ భరద్వాజ్ ఓ అందాల యాంకర్.. ఎప్పటికప్పుడూ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ పోతున్న బ్యూటీ. ఓవైపు తన మాటలతోనే కాకుండా అందచందాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ కనుల విందు చేస్తోంది. ఈ అమ్మడి రచ్చ సోషల్ మీడియాలో మాములుగా ఉండదు. గ్లామరస్ ఫొటోలు షేర్ చేస్తూ కేక పెట్టిస్తుంటుంది. అయితే యాంకర్ అనసూయను, తన డ్రెస్ లను ట్రోల్ చేయడం, కామెంట్ చేయడం కొత్తేమీ కాదు. తాను కూడా ఆ కామెంట్స్, ఆ ట్రోల్స్ కి తగ్గట్టే రిప్లై ఇస్తుంటుంది.
అప్పుడప్పుడు తనపై వచ్చే ట్రోల్స్ కి గట్టిగానే సమాధానం చెబుతుంది అనసూయ. ఇటీవల అనసూయ పొట్టి దుస్తులలో ఫొటో షూట్ చేయగా.. అనసూయ గారు మీరు ఇద్దరు పిల్లల తల్లి. ఇంకా పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటావా ? తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నావు.. అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అయితే అనసూయ దీనికి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అనసూయ ఈ ట్వీట్ ని షేర్ చేస్తూ.. దయచేసి మీరు మీ పని చూసుకోండి, నన్ను నా పనిని చేసుకోవనివ్వండి. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు.. అని పోస్ట్ చేసింది.
అప్పుడప్పుడు ఈ ముద్దుగుమ్మ చాలా పద్దతిగా కూడా కనిపిస్తుంటుంది. శ్రీ రామ నవమి సందర్భంగా అనసూయ పోస్ట్ చేసిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో చాలా సంప్రదాయబద్ధంగా కనిపిస్తున్న అనసూయను చూసి తెగ కామెంట్లు పెడుతున్నారు. ఎంత పద్దతిగా ఉన్నారు.. అని ఒకరు కామెంట్ చేయగా, మరొకరు మీరు ఇప్పుడు చూడండి ఎంత పద్ధతిగా సంప్రదాయానికి చీర కట్టినట్టు ఉన్నారో.. ఇలా ఉంటే మీకు ఎప్పటికీ నెగెటివ్ కామెంట్స్ అసలు రావు. మీలాంటి సెలబ్రిటీలను చూసి ఇంకా చాలా మంది అమ్మాయిలు మీలా పద్ధతిగా డ్రెస్ వేసుకోవాలి.. అనుకుంటారు. మీరు ఎప్పుడూ ఇలాగే ఉండండి.. అని కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా తాను షేర్ చేసిన తాజా ఫొటో ప్రతి ఒక్కరినీ చాలా ఆకట్టుకుంటోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…