Malavika Mohanan : ప్రస్తుతం ఎంతో మంది సెలబ్రిటీలకు మాల్దీవ్స్ అనేది ఒక బ్యూటిఫుల్ వెకేషన్ స్పాట్‌గా మారింది. చాలా మంది హీరోయిన్లు అక్కడకు వెళ్లి వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తాజాగా సౌత్ బ్యూటీ మాళవిక మోహనన్ కూడా అక్కడ విహరిస్తోంది.
మాల్దీవ్స్ వెకేషన్‌లో ఉన్న మాళవిక మోహనన్ అబ్బుర పరిచే ఫొటోలను షేర్ చేస్తూ అలరిస్తోంది. స్విమ్ సూట్, బికినీలను ధరిస్తూ.. ఎద అందాలను ప్రదర్శిస్తూ మతులు పోగొడుతోంది. మాళవిక మోహనన్ షేర్ చేస్తున్న ఫొటోలు చలికాలంలో హీట్‌ను పెంచుతున్నాయి.
తాజాగా ఆమె నీటి అలలపై తేలియాడుతూ ఉన్న ఫొటోను షేర్ చేసింది. పలు వరుస ఫొటోలు, వీడియోలతో మాళవిక మోహనన్ ఇప్పటికే యువకుల మతులను పోగొట్టింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి.