Malavika Mohanan : సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ప్రస్తుతం హీరోయిన్ల దగ్గర్నుంచి బుల్లితెర నటులు, యాంకర్ల వరకు అందరూ ఇందులోనే కాలక్షేపం చేస్తున్నారు. తమ అప్‌డేట్స్ ను వాటిల్లో పోస్ట్ చేస్తూ తమ ఫాలోవర్లకు దగ్గరగా ఉంటున్నారు. అలాగే ఫాలోవర్ల సంఖ్యను కూడా పెంచుకుంటున్నారు.ఇక హీరోయిన్లు, బుల్లితెర యాంకర్లు అయితే అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతున్నారు. గ్లామర్ షోకు పెద్ద పీట వేస్తున్నారు. సినిమాల్లో ఆఫర్లు రావడమే లక్ష్యంగా రెచ్చిపోతున్నారు. అలాంటి హీరోయిన్లలో మాళవిక మోహనన్ ఒకరని చెప్పవచ్చు. ఈమె సోషల్ మీడియా వేదికగా చేస్తున్న అందాల ప్రదర్శనకు అడ్డు అదుపు ఉండడం లేదు.

మాళవిక మోహనన్ ఇప్పటి వరకు తెలుగులో నటించలేదు. కానీ తమిళ ప్రేక్షకులకు ఈ భామ పరిచయమే. ఈమె విజయ్‌తో కలిసి మాస్టర్‌లో నటించి అలరించింది. తరువాత ఇటీవలే ధనుష్‌తో కలిసి ఓ సినిమా చేసింది. అది నేరుగా ఓటీటీలో రిలీజ్ అయింది. పెద్దగా ఆదరణ లభించలేదు. దీంతో ఆఫర్ల కోసం వేట కొనసాగిస్తోంది. అయితే ప్రభాస్, మారుతి కలసి చేస్తున్న సినిమాలో ఈమెకు ఓ రోల్ లభించిందని.. అందుకు ఈమె అంగీకరించిందని తెలుస్తోంది. అదే నిజమైతే తెలుగులో ఈమె చేసే మొదటి సినిమా ఇదే అవుతుంది.
ఇక మాళవిక మోహనన్ సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. ఈమె సినిమాల్లోకి రాకముందే మోడల్ కనుక ఆ తరహా ఫొటోలను ఎక్కువగా పోస్ట్ చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు భారీ అందాలను ప్రదర్శిస్తూ రెచ్చగొడుతుంటుంది. అందులో భాగంగానే తాజాగా ఈమె తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. అందులో మళ్లీ భారీ అందాలను బయట పెట్టింది. ఈ క్రమంలోనే వాటిని చూసిన యువత మైమరిచిపోతున్నారు. ఇక ఈ ఫొటోలు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతున్నాయి.