Malaika Arora : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగర్ చిత్రంలో ఐటమ్ సాంగ్‌తో మెప్పించిన అందాల ముద్దుగుమ్మ మలైకా అరోరా. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన మలైకా అరోరా నటిగా గుర్తింపును అందుకోలేదు. కానీ, ఛయ్య ఛయ్య.., అనార్కలీ డిస్కో ఛాలీ, మున్నీ బద్నామ్ హుయే.. వంటి స్పెషల్ సాంగ్స్‌తో పాపులర్ అయింది. 48 ఏళ్ల వయసున్న ఈ సీనియర్ ఐటమ్ బ్యూటీ గ్లామర్ కు బీటౌన్ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. కుర్రాళ్లకు చెమటలు పట్టే అందం ఆమె సొంతం. అయితే తన కన్నా 12 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో మలైకా రిలేషన్‌షిప్‌లో ఉండడం చర్చనీయాంశంగా మారింది.

బాలీవుడ్ జంట అర్జున్ కపూర్.. మలైకా అరోరా సహజీవనం వ్యవహారం ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీళ్లిద్దరికీ వయసులో 12 ఏళ్ల తేడా ఉంది. అంతేకాదు.. 45 ఏళ్ల మలైకా అరోరా.. భర్త అర్భాజ్ ఖాన్‌కు విడాకులు ఇచ్చింది. అలాగే, ఆమెకు ఓ అబ్బాయి కూడా ఉన్నాడు. అయినప్పటికీ అర్జున్‌తో సహజీవనం చేస్తోంది. అందుకే ఈ జంట యమ ఫేమస్ అయిపోయింది. అయితే వీరిద్దరి రిలేషన్ విషయంలో తరచూ ట్రోల్స్ ఎదుర్కొంటోంది ఈ జంట. అయినా ఆ రూమార్లను అవాయిడ్ చేస్తు వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు.
ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న మలైకాకు ఈ విషయంపైనే ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందించిన ఆమె అసహనానికి లోనైంది. ఎందుకు అందరూ ఈ విషయాన్ని పెద్దదిగా చూస్తున్నారంటూ ట్రోలర్స్‌పై మండిపడింది. మన సమాజంలో వయసులో చిన్న వాడితో సహజీవనం చేయడాన్ని తప్పుగా ఎందుకు భావిస్తున్నారో అర్థం కావడం లేదు. ధైర్యంగా ఎలా జీవించాలో నేను మా అమ్మ నుంచి ప్రేరణ పొందాను. నాకు నచ్చిన జీవితం జీవించమని నాకేప్పుడూ మా అమ్మ చెబుతూ ఉంటుంది. విడాకుల అనంతరం ప్రతి స్త్రీ లైఫ్‌లో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. వాటన్నింటినీ అధిమించి మహిళలు ధైర్యంగా జీవించాలని.. మలైకా సూచించింది.