Simhasanam Movie : సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో చిత్రాల్లో నటించారు. అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. తెలుగు సినిమా పరిశ్రమకు అనేక రకాల టెక్నాలజీలను పరిచయం చేసిన ఘనత ఈయన సొంతం. అలాగే మొదటి కౌబాయ్ సినిమా, మొదటి కలర్ సినిమా, మొదటి గూఢచారి సినిమాలను తీసింది కూడా ఈయనే. ఇలా కృష్ణ పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. అయితే కృష్ణ కెరీర్‌లో అత్యంత భారీగా హిట్ అయిన మూవీల్లో సింహాసనం ఒకటి. అప్పట్లో ఈ మూవీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.
సింహాసనం సినిమాను ఇప్పటి బాహుబలి సినిమాతో పోల్చవచ్చు. అప్పట్లో ఈ మూవీ ఒక ట్రెండ్‌ను క్రియేట్ చేసింది. ఆయనకు 1980లలో జానపద చిత్రాన్ని తీయాలని ఉండేది. దీంతో సింహాసనం ప్రారంభించారు. అయితే ఈ మూవీకి బడ్జెట్ ఎక్కువ వేశారు. రూ.3.50 కోట్లతో సినిమా తీయాలని అనుకున్నారు. కానీ మూవీ ఫ్లాప్ అయితే నిర్మాతలు తీవ్రంగా నష్టపోతారని కృష్ణ భావించారు. దీంతో ఆయనే స్వయంగా తన పద్మాలయా స్టూడియోస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించాలని అనుకున్నారు. అలా సినిమాను తీశారు. ఇక దీనికి ఆయనే దర్శకత్వం కూడా వహించారు.
కాగా సింహాసనం సినిమా తీస్తున్న సమయంలో నిత్యం పేపర్లలో ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించి వార్తలు వచ్చేవి. దీంతో సినిమాపై సహజంగానే ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో బాలీవుడ్ నటి మందాకినితోపాటు జయప్రద, రాధ నటించారు. మూవీ షూటింగ్‌ను 53 రోజుల్లోనే పూర్తి చేశారు. అప్పట్లో ఒక సినిమా తీయాలంటే రూ.50 లక్షల బడ్జెట్‌ను కేటాయించారు. కానీ ఈ మూవీని ఏకంగా రూ.3.50 కోట్లో తీసి కృష్ణ అప్పట్లో సాహసం చేశారనే చెప్పాలి. అలాగే ఈ మూవీని తెలుగుతోపాటు హిందీలోనూ చిత్రీకరించారు. కాకపోతే అందులో జితేంద్ర హీరోగా నటించారు. ఈ క్రమంలోనే ఈ మూవీ 1986 మార్చి 21న రిలీజ్ అయింది. తెలుగుతోపాటు హిందీలోనూ ఈ మూవీ రిలీజ్ అయి సంచలనాలను సృష్టించింది.
అప్పట్లో ఈ మూవీకి ఊహించిన దానికన్నా అధికంగా కలెక్షన్స్ వచ్చాయి. ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన లభించింది. సినిమా టిక్కెట్ల కోసం ఏకంగా 12 కి.మీ. మేర క్యూ లైన్‌లు కట్టారు. ఇక మొదటి వారం ఈ మూవీ రూ.1.51 కోట్ల గ్రాస్‌ను సాధించగా.. సింగిల్ థియేటర్‌లో రూ.15 లక్షల గ్రాస్‌ను వసూలు చేసింది. విశాఖపట్నంలో ఈ మూవీ 100 రోజులు ఆడింది. 3 సెంటర్లలో ఈ సినిమా రూ.10 లక్షలకు పైగానే వసూలు చేయగా.. మొత్తంగా రూ.7 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇది అప్పట్లో చాలా ఎక్కువ. ఇక ఈ మూవీ 100 రోజుల వేడుకను చెన్నైలో నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి కృష్ణ ఫ్యాన్స్ ఏకంగా 400 బస్సుల్లో వచ్చి అప్పట్లో చరిత్ర సృష్టించారు. దీంతో ఈ వార్త టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. అలా కృష్ణ సింహాసనం మూవీ అప్పట్లో సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…