Shruti Haasan : సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో అనేక వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. వాటిల్లో సెలబ్రిటీలకు సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే రోజుకో వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇక తాజాగా శృతి హాసన్‌కు చెందిన ఒక వార్త హల్ చల్ చేస్తోంది. శృతి హాసన్ కండిషన్ చాలా సీరియస్‌గా ఉందని.. ఆమె హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స పొందుతుందని.. వార్తలు వచ్చాయి. అయితే వాటిపై శృతి హాసన్ స్పందించింది. ఒక వీడియో మెసేజ్ ద్వారా ఆ వార్తలను ఖండించింది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే..
సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని శృతి హాసన్ కొట్టి పారేసింది. అవన్నీ పుకార్లేనని వాటిని నమ్మవద్దని చెప్పింది. తనకు ఏమీ కాలేదని.. నిక్షేపంగా ఉన్నానని.. కండిషన్ సీరియస్ అని.. ఐసీయూలో ఉన్నానని వస్తున్న వార్తలను నమ్మొద్దని ఆమె కోరింది. కొందరు కావాలనే తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే తనకు పీసీవోఎస్ సమస్య చాలా కాలంగా ఉందని.. అంతేకానీ తన ఆరోగ్యం మాత్రం క్షీణించలేదని.. మరోమారు స్పష్టం చేసింది.
ఇక శృతి హాసన్ ఈమధ్యే కరోనా బారిన పడింది. ఆ తరువాత కోలుకుంది. కానీ కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత ఈమె షాకింగ్ లుక్‌లో కనిపించింది. దీంతో ఈమె ఆరోగ్యం నిజంగానే క్షీణించిందని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ వార్తల్లో నిజం లేదని ఆమెనే స్వయంగా చెప్పేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. శృతి ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్‌లో నటిస్తుండగా.. మరోవైపు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న బాలయ్య సినిమాలోనూ ఈమె నటిస్తోంది. దీంతోపాటు చిరంజీవి సినిమాలోనూ ఈమె కన్‌ఫామ్ అయింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…