Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అయితే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన RRR చిత్రం విడుదల కానుందని చిత్ర బృందం గతంలో అధికారికంగా ప్రకటించింది.
ఈ ఏడాది దసరా కానుకగా విడుదల కావలసిన ఈ సినిమా పలు కారణాల వల్ల జనవరి 7వ తేదీకి వాయిదా పడింది. రాజమౌళి RRR సినిమా సంక్రాంతికి విడుదల కానుండడంతో మహేష్ బాబు సర్కారు వారి పాట వేసవి సెలవులలో విడుదల కాబోతుందని ప్రచారం జరిగింది. అయితే మహేష్ బాబు ఏమాత్రం వెనకడుగు వేయకుండా తన సినిమాను సంక్రాంతి బరిలోనే ముందుగా అనుకున్న ప్రకారమే విడుదల చేయనున్నారు.
ఇలా సర్కారు వారి పాట చిత్రాన్ని అనుకున్న తేదీకి విడుదల చేయడంతో రాజమౌళి RRR కి గట్టి దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. అయితే సంక్రాంతి బరిలో ఉన్న మిగతా సినిమాలు ఏ మాత్రం వాయిదా వేసుకోకుండా అదే తేదీలలో విడుదలకు సిద్ధమయ్యాయి. ఇక రాజమౌళి సినిమా సంక్రాంతికి కూడా వాయిదా పడుతుందన్న నమ్మకంతో మిగతా సినిమాలేవీ వారి విడుదల తేదీలను వాయిదా వేసుకోవడం లేదని తెలుస్తోంది. మరి రాజమౌళి ఏం చేస్తారో చూడాలి.