Mahesh Babu : పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం.. సర్కారు వారి పాట. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తాజాగా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక సందర్భంగా మహేష్ స్టేజిపై ఒకానొక దశలో భావోద్వేగానికి గురయ్యారు. తనకు ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలపై ఆయన ఎమోషనల్ అయ్యారు. అయితే సర్కారు వారి పాట చిత్రాన్ని చేస్తున్నప్పుడు తనకు పోకిరి రోజులు గుర్తుకు వచ్చాయని.. కనుక దానిలాగే ఈ మూవీ కూడా ఫ్యాన్స్‌ను అలరిస్తుందని అన్నారు. ఈ క్రమంలోనే మే 12వ తేదీన భారీ ఎత్తున ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. అయితే ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా మహేష్ ధరించిన షర్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన ఆరెంజ్ కలర్ షర్ట్ ధరించి వచ్చారు. అయితే దీనిపై సోషల్ మీడియాలో చర్చల మీద చర్చలు నడుస్తున్నాయి. ఇటీవల వచ్చిన కాశ్మీర్ ఫైల్స్, ఆర్ఆర్ఆర్ మూవీలను ఉత్తరాది వారు హిందుత్వ సినిమాలుగా అభివర్ణించారు. దీంతో మహేష్ కూడా ఆ కోవలోనే వెళ్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. అయితే మహేష్ సినిమా సర్కారు వారి పాట వాస్తవానికి హిందీలో రిలీజ్ కావడం లేదు. కానీ ఆయనకు హిందుత్వ సెంటిమెంట్‌ను ఆపాదిస్తున్నారు. ఆయన హిందువా.. ఇంకో మతాన్ని ఫాలో అవుతారా.. అన్నది పక్కన పెడితే.. ఆయన బయటకు చెప్పకుండా ఆయనకు ఇలా ఒక మతాన్ని ఆపాదించడం కరెక్ట్ కాదని అంటున్నారు. దీంతో ఆయన ఆరెంజ్ కలర్ షర్ట్‌పై అనేక వాదనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఆయన సినిమా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
ఇక సర్కారు వారి పాట సినిమాకు థమన్ సంగీతం అందించగా.. ఈ మూవీకి చెందిన కళావతి, పెన్నీ సాంగ్స్‌తోపాటు టైటిల్ సాంగ్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మ్యూజిక్ పరంగా హిట్ అయిన ఈ మూవీ ఇతర అంశాల పరంగా కూడా హిట్ అవుతుందని అంటున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎలాంటి పెర్ఫార్మెన్స్‌ను ఇస్తుందో చూడాలి.