Mahesh Babu : సోషల్ మీడియాలో హీరోల ఫ్యాన్స్‌కు మధ్య ఉండే తగవు మామూలే. తమ హీరో గొప్ప అంటే తమ హీరోనే గొప్ప.. అని ఫ్యాన్స్ ఎప్పుడూ వాదులాడుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తమ హీరోల సినిమాలు వచ్చినప్పుడు ఫ్యాన్స్ సంబరపడిపోతారు. ఇక అవతలి హీరోల ఫ్యాన్స్ మాత్రం విమర్శలు చేస్తుంటారు. ఇది షరా మామూలే. కానీ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన పనికి ఆయన ఫ్యాన్స్ తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే..
జనవరి 2020లో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలు సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. అయితే అల వైకుంఠపురములో మూవీ మాత్రం కలెక్షన్ల పరంగా కొంచెం పైచేయి సాధించింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అప్పట్లో మహేష్ పై విమర్శలు చేశారు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. ప్రతి విమర్శలు చేశారు.
అలా ఇరు హీరోలకు చెందిన ఫ్యాన్స్ మధ్య అప్పటి నుంచి సోషల్ మీడియాలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల అల్లు అర్జున్ పుష్ప మూవీకి మిక్స్‌డ్ టాక్ లభించింది. అయినప్పటికీ కలెక్షన్లు బాగానే వచ్చాయి. దీంతో ఆ చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌లు నిర్వహించింది. అయితే అవన్నీ ఉత్త మాటలేనని, బోగస్ కలెక్షన్లు అని చెబుతూ మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
ఇక ఇటీవలే మహేష్ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చి పుష్ప సినిమా చూశారు. దీంతో ఆ మూవీ బాగుందని కితాబిచ్చారు. ఈ క్రమంలోనే మహేష్ చేసిన కామెంట్స్‌కు ఆయన ఫ్యాన్స్ అప్‌సెట్ అయ్యారు. వారు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. తాము ఒకవైపు మహేష్ కోసం సోషల్ మీడియాలో పోరాటం చేస్తుంటే.. ఆయన ఇలా అల్లు అర్జున్ మూవీ బాగుందని చెప్పడం.. తమకు ఎంత మాత్రం నచ్చడం లేదని అంటున్నారు. అయితే చివరకు ఈవిషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…